YouTube Parental Control:  ప్రతిరోజూ కోట్లాది మంది యూట్యూబ్‌ని ఉపయోగిస్తున్నారు. వినోదం కోసం ఉపయోగించే ఈ యాప్‌లో మీకు అన్ని రకాల కంటెంట్ లభిస్తుంది. కొన్నిసార్లు మీరు ఏదైనా పెద్దలు మాత్రమే చూసే కంటెంట్‌ కోసం చూస్తే తర్వాత కూడా అదే కంటెంట్‌ వస్తూ ఉంటుంది. దీని వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. 

Continues below advertisement

చాలాసార్లు చెడు వీడియోలు సెర్చ్‌ ఫీడ్‌లో కూడా కనిపిస్తాయి, దీని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులకు లేదా పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి వెనుకాడతారు. వాళ్లు అలాంటి కంటెంట్ కనిపిస్తే ఇబ్బంది పడతారని తప్పుగా అనుకుంటారని భావిస్తున్నారు. కానీ ఈ రోజు మేము మీకు ఒక ట్రిక్ గురించి చెబుతున్నాము, దీనితో మీరు దీన్ని సులభంగా కనిపించకుండా చేయవచ్చు. ఈ టూల్ ఉపయోగించి మీరు ఎలాంటి భయం లేకుండా  మీ పిల్లలకు మీ ఫోన్‌ను కూడా ఇవ్వవచ్చు. 

ముందుగా, మీరు మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి . ఆ తర్వాత మీ ప్రొఫైల్‌కి వెళ్లి, మీరు సెట్టింగ్‌ ఆప్షన్‌కు వెళ్లాలి. ఆ తర్వాత మీరు జనరల్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేసినప్పుడు, మీకు Restricted Mode అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది, మీరు దాన్ని ఆన్ చేయాలి. బటన్‌ను ఆన్ చేసిన వెంటనే, మీరు అప్లై అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసిన తర్వాత, మీ యూట్యూబ్ ఫీడ్‌లో చెడు వీడియోలు రావడం ఆగిపోతాయి. మీరు మీ పిల్లలకు మీ ఫోన్‌ను కూడా ఇవ్వగలరు. 

Continues below advertisement

సబ్‌టైటిల్స్‌ను ఎలా ఆన్ చేయాలి?

చాలాసార్లు, మనం భాష అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడే వీడియోలను చూస్తాము. కానీ యూట్యూబ్‌లో మీరు సబ్‌టైటిల్స్‌ను ఆన్ చేయడం ద్వారా మీ మాతృ భాషలో లేదా నచ్చిన భాషలో  ఏ లాంగ్వేజ్‌ వీడియోలనైనా అర్థం చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక చిన్న పని చేయాలి. మీరు యూట్యూబ్ వీడియోను ప్లే చేసినప్పుడల్లా, మీకు CC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా మీరు వీడియో కింద ట్రాన్స్‌లేషన్ వస్తుంది. దాన్ని చదివి మీరు సులభంగా ఆ వీడియోలో కంటెంట్‌ను అర్థం చేసుకోవచ్చు. వీడియో కంటెంట్‌ను చూడడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ట్రాన్స్‌లేషన్ స్క్రిప్ట్‌ను మీకు నచ్చిన చోటకు మార్చుకోవచ్చు కూడా.

యూట్యూబ్‌లో వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

చాలా మంది నిత్యం యూట్యూబ్ చూస్తుంటారు. మంచి వీడియో కనిపిస్తే స్టాటస్ పెట్టుకోవాలని, ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయాలని ఉంటుంది. కానీ దాని లింక్‌ను మాత్రమే షేర్ చేస్తారు. వీడియో డౌన్‌లోడ్ చేసి షేర్ చేయడం రాకపోవడంతో కేవలం లింక్‌ను షేర్ చేస్తారు. కొన్నిసార్లు ఇంటర్‌నెట్‌ లేని ప్రాంతాల్లో కూడా మన ట్రావెల్ చేయడమో, లేదా విజిట్ చేయడం ఉండటమో చేస్తాం అలాంటి సమయంలో టైం పాస్ కావాలంటే కచ్చితంగా చేతిలో మొబైల్ ఉండాలి. కానీ అప్పుడు ఇంటర్‌నెట్ లేకపోవడంతో ఇబ్బంది పడతారు. అందుకే ముందుగానే కొన్ని సినిమాలు, ఎడ్యుకేషన్, ఇతర విభాగాల వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటే సమస్య ఉండదు. 

నేరుగా మీరు యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేయాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. అలాంటి కాని పక్షంలో థర్డ్‌పార్టీ యాప్స్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అందులో భద్రతకు రిస్క్‌లేని వెబ్‌సైట్‌లను యూజ్ చేయాలి. Y2Mate, SaveFrom లేదా ClipConverter వంటి విశ్వసనీయ సైట్‌కి  వెళ్లి మీకు కావాల్సిన వీడియో లింక్‌ పేస్ట్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. మీకు కావాల్సిన వెర్షన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.