హానర్ ఎక్స్6 స్మార్ట్ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది.  ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


సౌదీ అరేబియాలో మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర సీక్రెట్‌గానే ఉంచినా ఫీచర్లను మాత్రం కంపెనీ వెబ్ సైట్ రివీల్ చేసింది. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.


హానర్ ఎక్స్6 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720x1,600 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు డెప్త్ సెన్సార్, మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ సపోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, యాంబియంట్  లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?