హానర్ ఎక్స్40 జీటీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ కొత్త హానర్ స్మార్ట్ ఫోన్‌లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
హానర్ ఎక్స్40 జీటీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.22,900) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (సుమారు రూ.26,300) నిర్ణయించారు. మ్యాజిక్ నైట్ బ్లాక్, రేసింగ్ బ్లాక్, టైటానియం ఎంప్టీ సిల్వర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇవి మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.
హానర్ ఎక్స్40 జీటీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గా ఉంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇన్‌బిల్ట్ మెమొరీని వర్చువల్‌గా మరో 7 జీబీ పెంచుకోవచ్చు. 13 లేయర్ల వీసీ కూలింగ్ సిస్టంను కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌ను కలిపితే ఎంత హెవీ గేమింగ్ చేసినా ఫోన్ ట్రబుల్ ఇవ్వదు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉన్న మూడు సెన్సార్లను వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
5జీ, బ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4880 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?