Google Pixel 7 Flipkart Sale: గూగుల్ పిక్సెల్ 7 సేల్ ప్రారంభం - ఫ్లిప్‌కార్ట్‌లో కొనేయచ్చు!

గూగుల్ పిక్సెల్ 7 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Continues below advertisement

గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్‌ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. గూగుల్ రెండో తరం టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7లొ అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది. ఏకంగా ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను గూగుల్ తన పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్‌కు అందించనుంది.

Continues below advertisement

గూగుల్ పిక్సెల్ 7 ధర, సేల్ వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. స్నో, ఆబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది.

గూగుల్ పిక్సెల్ 7 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.32 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ ప్రకటించింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola