Google Pixel 10 Vs Samsung Galaxy S25: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ Samsung తెచ్చిన Galaxy S సిరీస్ చాలాకాలం పాటు ప్రీమియం Android స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అయితే, Google Pixel 10 శాంసంగ్ ఫోన్‌కు గట్టి పోటీనిస్తోంది. Galaxy S25 బరువు కేవలం 165 గ్రాములు మాత్రమే, చాలా తేలికగా, కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. మరోవైపు, గూగుల్ Pixel 10 బరువు 204 గ్రాములు అంటే కాస్త అధికం. అయితే డిస్‌ప్లే కొంచెం పెద్దగా ఉంది, 6.3 అంగుళాలు డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది. ఇది 1080 x 2424 పిక్సెల్ రిజల్యూషన్, 60-120Hz రిఫ్రెష్ రేట్..  గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీని కలిగి ఉంది. గూగుల్ Pixel 10 గరిష్టంగా 3000 నిట్స్ వరకు వెళుతుంది, అయితే శాంసంగ్ Galaxy S25 గరిష్టంగా 2600 నిట్స్ వరకు పరిమితం అయింది.

Continues below advertisement


స్మార్ట్‌ఫోన్ల పనితీరు, ప్రాసెసర్


గతంలో Google కంపెనీ Tensor చిప్‌సెట్ పనితీరు, బ్యాటరీ కెపాసాటీపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ Pixel 10 లో ఉపయోగించిన కొత్త Tensor G5, TSMC 3nm సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇది వేగంతో పాటు మెరుగైన పవర్ సప్లైని అందిస్తుంది. Samsung Galaxy S25 లో ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Elite ఉంది. దాంతో ఇది బెస్ట్ పనితీరుతో ఆకట్టుకుంటోంది.


AI ఫీచర్లపై కూడా 2 కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. గూగుల్ Pixel 10 లో ఆన్-డివైస్ జనరేటివ్ AI తో అధునాతన ఫోటో ఎడిటింగ్ (Photo Editing), జూమ్, టెక్స్ట్ ప్రిడిక్షన్ వంటి టూల్స్ సైతం ఉన్నాయి. Samsung తన Galaxy AI ప్యాకేజీలో ట్రాన్స్‌లేషన్, ఉత్పాదకత, కెమెరా సంబంధిత ఫీచర్లను వినియోగదారులకు అందిస్తుంది. Galaxy పరికరాలు Google సంబంధిత AI సాధనాలకు సపోర్ట్ చేస్తాయి. 


కెమెరా సెటప్


ఫోటోగ్రఫీ Pixel 10 కు అతిపెద్ద బలంగా భావిస్తారు. ఇది మొదటిసారిగా టెలిఫోటో లెన్స్‌తో వచ్చింది. 5x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో 48 MP ప్రైమరీ కెమెరా, 10.8 MP టెలిఫోటో లెన్స్, 13 MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. అన్ని కెమెరాలు 20x సూపర్ రెస్యూమ్, 4K 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. కెమెరా Coach వంటి AI టూల్స్ ఇందులో ఉన్నాయి.


Galaxy S25 లో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్, 10 MP టెలిఫోటో కెమెరా లెన్స్ ఉన్నాయి. ఇది 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే Pixel 10 లో 10.5 MP ఆటోఫోకస్ లెన్స్ వస్తుంది. అయితే శాంసంగ్ Galaxy S25 లో 12 MP సెల్ఫీ కెమెరా ఉంది.


బ్యాటరీ, ఛార్జింగ్


Pixel 10 బరువు దాని బ్యాటరీలో తెలుస్తుంది. ఇది దాదాపు 5000mAh బ్యాటరీతో రాగా, Galaxy S25 లో 4000mAh బ్యాటరీ ఉంది. Pixel 10 పెద్ద అప్‌గ్రేడ్ Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయగా, ఇందులో Apple MagSafe వంటి Magnetic Power Profile ఉంది. అయితే, వైర్‌లెస్ ఛార్జింగ్ వేగం ఇప్పటికీ 15W వరకు పరిమితం చేశారు. మరోవైపు, Galaxy S25 కోసం ప్రత్యేక ఉపకరణాల మద్దతు ఉంది. వైర్ ఛార్జింగ్ గురించి విషయానికి వస్తే Pixel 10 లో 30W ఛార్జింగ్, ఇది Galaxy S25 25 W కంటే ఫాస్ట్‌గా అవుతుంది.


ధర, వేరియంట్‌లు


భారత్‌ మార్కెట్లో Google Pixel 10 ధర రూ .79,999 గా నిర్ణయించారు. ఇందులో 256GB స్టోరేజీతో ఒకే వేరియంట్ లభిస్తుంది. ఇది Indigo, Lemongrass, Frost తో పాటు Obsidian రంగులలో లభిస్తుంది. Samsung Galaxy S25 స్టోరేజీ 12GB + 256GB మోడల్ కోసం రూ .80,999 .. 12GB + 512GB స్టోరేజీ వేరియంట్ మోడల్ ధర రూ .92,999 గా ఉంది. ఇది Icy Blue, Navy, Silver Shadow, Mint రంగులలో వస్తుంది.