Upcoming smartphones: చాలా మంది టెక్ వినియోగదారులు క్యాలెండ్ మారిందంటే చాలు లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటని చూస్తుంటారు. ఫోన్ వినియోగదారులు కూడా కొత్తగా వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి నెల మాదిరిగానే జులైలో కూడా టాప్ మొబైల్ కంపెనీలు తమ ప్రోడెక్ట్స్‌ను విడుదల చేయబోతున్నాయి. ఈ నెలలో తమ నెక్స్ట్‌ జనరేషన్ ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Nothing, Samsung, OnePlus, OPPO, Vivo, Realme ఇలా ప్రధానమైన బ్రాండ్‌లు అన్నీ కూడా వినియోగదారులను మెప్పించేందుకు పోటీ పడబోతున్నాయి. ఈసారి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  

నథింగ్‌ ఫోన్‌ 3

జులై నెల Nothing Phone 3 రాకతో మొదలవుతుంది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్, Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌తో వస్తోంది. వెనుక భాగంలో “Glyph Matrix” అనే కొత్త LED సిస్టమ్ ఇన్‌బిల్ట్ చేశారు. ఇది ఆ ఫోన్‌ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీని కెమెరా సెటప్‌లో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది జూమ్ ఫోటోగ్రఫీని మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. 

OPPO Reno 14 సిరీస్

జులై 3న OPPO Reno 14 సిరీస్ మార్కెట్‌లోకి వస్తుంది. ఈ సిరీస్ కింద Reno 14, Reno 14 Pro స్మార్ట్‌ఫోన్‌లను ఒప్పో విడుదల చేయనుంది. వీటిలో వరుసగా Dimensity 8350, 8450 ప్రాసెసర్‌లు ఉన్నాయి. ఈసారి కంపెనీ AI ఆధారిత ఫోటోగ్రఫీ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనివల్ల వినియోగదారులు ప్రో-స్థాయి కెమెరా అనుభవాన్ని పొందుతారు. ఈ ఫోన్‌లలో 1.5K రిజల్యూషన్ కలిగిన OLED డిస్‌ప్లే, భారీ 6,200mAh బ్యాటరీని అందిస్తున్నారు.

OnePlus Nord 5 సిరీస్

జులై 8న OnePlus Nord 5 సిరీస్ విడుదలవుతుంది. ఇందులో Nord 5, Nord CE 5 స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. Nord 5 Snapdragon 8s Gen 3 చిప్‌తో వస్తుంది. Nord CE 5 Dimensity 8350తో వస్తుంది. ఈ ఫోన్‌ల ప్రత్యేకత ఏమిటంటే వాటి 7,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇది మిడ్-రేంజ్ కేటగిరీలో గట్టి పోటీదారుగా మారబోతోంది. 

Samsung Galaxy ఫోల్డబుల్ డివైస్‌ 

జులై 9న, Samsung వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న Galaxy Unpacked 2025 ఈవెంట్‌ నిర్వహిస్తుంది. ఇందులో Galaxy Z Fold 7, Z Flip 7, Z Fold Ultra, FE Flip వంటి కొత్త మోడల్‌లు పరిచయం చేయనుంది. ఈసారి కంపెనీ తమ ఫోల్డబుల్స్‌ను మునుపటి కంటే తేలికగా, దృఢంగా, మన్నికైనవిగా తయారు చేస్తుందని మార్కెట్‌లో ఓ చర్చ జరుగుతోంది. అలాగే ట్రై-ఫోల్డ్ ప్రోటోటైప్  కూడా కనిపించవచ్చు. కంపెనీ ఫోన్‌లు చాలా స్టైలిష్ డిజైన్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు.

Vivo X200 FE

Vivo కూడా ఈ నెలలో X200 FE అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. ఇది X సిరీస్‌లో మొదటి ఫ్యాన్ ఎడిషన్ మోడల్ అవుతుంది. ఇందులో Dimensity 9300+ ప్రాసెసర్, Zeiss బ్రాండ్ కెమెరాలు ఉంటాయి. అదనంగా, 4K ఫ్రంట్ వీడియో రికార్డింగ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ దాని కొన్ని ప్రధాన లక్షణాలలో ఒకటి.

Realme 15 సిరీస్

Realme కూడా తగ్గడం లేదు. ఈ కంపెనీ Realme 15 సిరీస్ ఈ నెలలో అమ్మకాలు ప్రారంభించనుంది. ఇందులో Realme 15, 15 Pro స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో ఆకట్టుకోనున్నాయి. ప్రస్తుతానికి వాటి గురించి ఎక్కువ సమాచారం బయటకు రాకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. అయితే ఈ డివైస్‌లు శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు, భారీ ధరలతో వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.