Good Mobile Under 20000: మొబైల్ ఫోన్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో చేరిపోయింది. దీంతో చాలామంది బడ్జెట్ లో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు కొనాలని చూస్తున్నారు. ఇక చాలా కంపెనీలు యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, షావోమీ, ఐక్యూ, వీవో ఇలా చాలా కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. మరి వాటిల్లో ఏది బెస్ట్ ఫీచర్ ఫోన్, ఏది మంచి ఫీచర్లతో వస్తుందో చూద్దాం.
ఐక్యూ..
ఐక్యూ జెడ్9 సిరీస్ ఇండియాలో రిలీజైన మంచి ఫోన్లలో, బడ్జెట్ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్ ఫంక్షనింగ్, ఆపరేంటింగ్ సిస్టమ్ చాలా బాగుందనేది ఈ ఫోన్ వాడిన కస్టమర్ల ఫీడ్ బ్యాక్. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో ఒకసారి చూద్దాం.
ఐక్యూ జెడ్ 9 5జీ..
6.67 ఇంచ్, 2కే రెజల్యూషన్, 120 హెచ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే. ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 50 ఎంపీ సోనీఐఎమ్ ఎక్స్882 ఓఐఎస్, 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ.
రెడ్ మీ 12 5జీ..
ఈ ఫోన్ ని 2023లో లాంచ్ చేశారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఫోన్. డౌన్ లోడ్ లకి ఈ ఫోన్ బాగుందనే రివ్యూలు ఉన్నాయి. గేమింగ్, క్లిస్టర్ క్లియర్ వీడియో కాల్స్ తో ఫోన్ బాగుంది. మరి దీని ఫీచర్లు ఏంటంటే?
6.67 ఇంచ్ ఎఫ్ హెచ్ డీ + సూపర్ ఏఎమ్ వో ఎల్ ఈడీ. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్, 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128, 256 జీబీ స్టోరేజ్. 48 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ బ్యాక్ కెమెరా. 13ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వన్ ప్లస్ నార్డ్ 3ఈ లైట్ 5జీ..
వన్ ప్లస్ నార్డ్ 3ఈ లైట్ 5జీ ఫీచర్ల విషయానికొస్తే.. 6.72 ఇంచ్, 120 హెచ్ జడ్ రీఫ్రెష్ రేట్, ఎఫ్ హెచ్ డీ + (1080 2400). ఆండ్రాయిడ్ 13.1, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 108 ఎంపీ + 2ఎంపీ + 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా. 5000 ఏంఏహెచ్ బ్యాటరీ.
రియల్ మీ నార్జో 70 5జీ..
రియల్ మీ నార్జో 70 5జీ విషయానికొస్తే.. 6.67 ఇంచ్, 120 హచ్ జడ్ ఏమ్ వో లెడ్ డిస్ ప్లే, 2400 1080 రెజల్యూషన్ తో డిస్ ప్లే. ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ర్యామ్ 8జీబీ, స్టోరేజ్ 128 జీబీ, 50 ఎంపీ + 2ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కమెరా. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్ 34 5జీ..
శామ్ సంగ్ గెలాక్సీ ఎమ్ 34 5జీ ఫోన్ 6.6 ఇంచ్ డిస్ ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ వీ12.0 ఓఎస్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, స్టోరేజ్ 128 జీబీ, 50 ఎంపీ + 5 ఎంపీ + 2ఎంపీ + 2 ఎంపీ. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రియల్ మీ 12 + 5జీ..
6.78 ఇంచ్, 2400 1080 ఎఫ్ హెచ్ డీ + రిజల్యూషన్. ఆండ్రాయిడ్ 13, 8జీబీ, 6జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ + 8 + 2ఎంపీ. 16 ఎంపీ కెమెరా. 5000 ఏంఏహెచ్ బ్యాటరీ.
ఒప్పో ఏ79 5జీ..
ఒప్పో నఏ79 5జీ 6.72 ఇంచ్ హెడ్ డీ + 90హెచ్ జడ్ డిస్ ప్లే. కలర్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్. 8జీబీ ర్యామ్, 128 జీబీ, 50 ఎంపీ మెయిన్ కమెరా + 2 ఎంపీ సెకెండరీ కెమెరా. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
వీవో వై28 5జీ..
6.58 ఇంచ్, 120 హెచ్ జడ్ ఎఫ్ హెచ్ డీ + డిస్ ప్లే. గ్లోబల్ ఓఎస్ 13. 4జీబీ, 6జీబీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. 50 ఎంపీ+ 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
వన్ ప్లస్ లో ఈ ఫోన్లు ఉన్నాయి..
వన్ ప్లస్ బ్రాండ్ నార్డ్ సిరీస్ ని ఇండియాలో లాంచ్ చేసింది. తక్కువ ధరకి మంచి ఫీచర్స్ తో, కెమెరాతో ఫోన్లను రిలీజ్ చేసింది. దాంట్లోనే కొత్త సిరీస్ లని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం సీఈ4 సిరీస్ మార్కెట్ లో ఉన్నప్పటికీ సీఈ3కి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2014లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్లలో ఒకటి వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ. కారణం దాంట్లో ఉన్న ఫీచర్స్. ఒకసారి దానికి సంబంధించి ఫీచర్లను చూద్దాం.
వన్ ప్లస్ సీఈ3 5జీ..
6.7 ఇంచ్ డిస్ ప్లే, ఆక్సీజన్ బేస్ ఆండ్రాయిడ్ 13, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్, 8జీబీ / 12జీబీ, 128జీబీ / 256జీబీ స్టోరేజ్. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్, 16ఎంపీ ఫ్రంట్ కమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ.
Also Read: అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్ - OnePlus Ace 3 Pro లాంచింగ్ ఎప్పుడంటే?