అసుస్ తన కొత్త గేమింగ్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే అసుస్ రోగ్ ఫోన్ 7 అల్టిమేట్. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం హైఎండ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ ఆధారిత రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. అసుస్ రోగ్ ఫోన్ 7 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ లాంచ్ అయింది
అసుస్ రోగ్ ఫోన్ 7 అల్టిమేట్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ టాప్ ఎండ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. స్టార్మ్ వైట్ కలర్ మోడల్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మే నెలలో ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
అసుస్ రోగ్ ఫోన్ 7 అల్టిమేట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ నానో సిమ్ ఫీచర్ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రోగ్ యూఐ, జెన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంలపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 720 హెర్ట్జ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జీపీఎప్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.3, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐపీ54 రేటింగ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 1.03 సెంటీమీటర్లు కాగా, బరువు 239 గ్రాములుగా ఉంది.
దీంతోపాటు అసుస్ రోగ్ ఫోన్ 7 కూడా లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లూ దాదాపు ఒకేలా ఉన్నాయి. కేవలం ర్యామ్, స్టోరేజ్ మాత్రమే అల్టిమేట్ ఎడిషన్‌లో ఎక్కువగా ఉన్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 7లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. స్టార్మ్ వైట్ కలర్ మోడల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫాంటం బ్లాక్ కలర్ వేరియంట్ కూడా లాంచ్ అయింది. మే నెలలోనే దీని సేల్ ప్రారంభం కానుంది.