ఐఫోన్ 18 సిరీస్‌లో ఆపిల్ చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. తాజా లీక్‌ల ప్రకారం, ఆపిల్ తన రాబోయే సిరీస్‌లో అండర్ డిస్‌ప్లే ఫేస్ ID రావొచ్చు. గత 4-5 సంవత్సరాలుగా ఈ ఫీచర్ కోసం ఐఫోన్ యూజర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆపిల్ చివరకు దీనిని పరీక్షించడం ప్రారంభించింది. అదే సమయంలో తన సరఫరాదారులను కూడా కాంపోనెంట్లను తయారు చేయాలని కోరింది. ఐఫోన్ 18 సిరీస్‌లో అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడీ ఫీచర్ కనిపించే అవకాశం ఉందని సూచిస్తుంది.
టెస్టింగ్ మొదలుపెట్టిన ఆపిల్
ఒక చైనీస్ టిప్‌స్టర్ ప్రకారం, ఆపిల్ మైక్రో-ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ చుట్టూ ఉన్న ఇన్-డిస్‌ప్లే ప్రమాణీకరణ వ్యవస్థను పరీక్షిస్తోంది. ఈ విధంగా ట్రూడెప్త్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ స్క్రీన్ లోపల నుంచి పనిచేస్తుంది. ఇది డిస్‌ప్లేపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఈ టెక్నాలజీ కోసం ఎదురుచూస్తూ, ఆపిల్ ఇప్పటివరకు ఈ ఫీచర్‌ను విడుదల చేయలేదు. ఐఫోన్ 18 సిరీస్‌లో ఈ ఫీచర్ వస్తుందని లీక్‌లో పేర్కొన్నారు. అయితే లైన్‌అప్‌లోని అన్ని మోడల్‌లు ఈ ఫీచర్‌తో వస్తాయా లేదా ఇది ప్రో మోడల్‌లలో మాత్రమే ఇస్తారా అనే దానిపై సైతం క్లారిటీ రాలేదు.
డైనమిక్ ఐలాండ్‌కు సెలవు ఇవ్వాలని ఆపిల్ కోరుకుంటోంది
ఆపిల్ 2027లో పూర్తి డిస్‌ప్లేతో ఐఫోన్ 20ని విడుదల చేస్తుంది. దీని స్క్రీన్‌పై ఎలాంటి కటౌట్ ఉండదు. ఆ దిశలో కదలడానికి, ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటోంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఐఫోన్ 18 సిరీస్‌లో డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గించనునంది. ఫేస్ ID సెన్సార్‌ను అండర్ డిస్‌ప్లేకి తరలించిన తర్వాత, టాప్ నాచ్‌లో తక్కువ సెన్సార్లు మిగిలి ఉంటాయి. యాపిల్ కంపెనీ దీనిని చిన్నదిగా చేయడానికి చూస్తుంది. ఐఫోన్ 18ప్రో మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ స్థానంలో కేవలం కెమెరా నాచ్ మాత్రమే ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
ఐఫోన్ 18 సిరీస్ విడుదల ఎప్పుడు..
ఆపిల్ కొత్త లాంచ్ షెడ్యూల్ ప్రకారం, 18 సిరీస్ ప్రో మోడల్స్, ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. అయితే స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ 2027 ప్రారంభంలో ఐఫోన్ 18తో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్లో వినిపిస్తోంది.