యాపిల్ ప్రతి యేటా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈవెంట్ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. 2022లో కూడా సెప్టెంబర్ రెండో వారంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏమేం లాంచ్ కానున్నాయనే వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఐడ్రాప్‌న్యూస్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం... యాపిల్ ఈవెంట్ ఈసారి సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది. అయితే ఈసారి ఈవెంట్‌కు ప్రేక్షకులను ఆహ్వానిస్తారా? లేదా వర్చువల్‌గానే జరగనుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఆగస్టులో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటినుంచే యాపిల్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్వైట్లను పంపిస్తుంది. ఐఫోన్ 14 లుక్ విషయంలో 13 మోడల్ తరహాలోనే ఉండనుందని సమాచారం. అయితే ఈసారి ఐఫోన్‌లో ఏ15 ప్రాసెసర్ బదులు దాని అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన ఏ16 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది.
వీటితో పాటు ఎయిర్ పోడ్స్ ప్రో 2 కూడా ఈ ఈవెంట్లోనే లాంచ్ కానున్నాయి. వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ రంగంలో విప్లవాత్మకమైన ఇన్నోవేషన్‌తో ఇవి రానున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి డిజైన్, కనెక్టివిటీ విషయంలో ఎటువంటి మార్పులు చేయనుందో తెలియాల్సి ఉంది. ఈ ప్రో ఇయర్ బడ్స్ ధర 299 డాలర్ల రేంజ్‌లో (సుమారు రూ.23,200) ఉండనుందని సమాచారం.
ఇక యాపిల్ వాచ్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం మూడు మోడల్స్ వచ్చే అవకాశం ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 8, కొత్త వాచ్ ఎస్ఈ, వాచ్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ కూడా ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. పాత డిజైన్‌తోనే కొత్త హార్డ్‌వేర్‌తో ఈ వాచ్‌లు రూపొందించనున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు. యాపిల్ వాచ్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ధర 399 డాలర్ల (సుమారు రూ.31,000) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!