అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అయింది. అంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లేని వాళ్లు ఈ సేల్‌లో పాల్గొనాలంటే రేపటివరకు ఆగాల్సిందే. వేర్వేరు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్‌లపై అమెజాన్ అందించనున్న ఆఫర్లను ప్రైమ్ మెంబర్స్ ముందుగానే యాక్సెస్ చేయవచ్చన్న మాట.
ఈ సేల్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, ఐకూ స్పాన్సర్ చేస్తున్నాయి. కాబట్టి వీటిపై మంచి ఆఫర్లను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. కొన్ని డీల్స్ ఇప్పటికే లైవ్ అయ్యాయి. సేల్ మొదటి రోజు ప్రతి ఆరు గంటలకు అమెజాన్ గ్రేట్ ఓపెనింగ్ డే డీల్స్‌ను అందించనుంది.
ఈ సంవత్సరం అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎనిమిది రోజులు జరగనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ డీల్స్‌ను పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతోపాటు క్యాష్‌బ్యాక్ రివార్డులకు అమెజాన్ డైమండ్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే... ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్ ఫోన్ రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీని రూ.11,999కు, రెడ్‌మీ నోట్ 11ను రూ.10,799కు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ రూ.40 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ స్మార్ట్ ఫోన్ రూ.52,999కు అందుబాటులో ఉంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ రూ.16,999కే అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్ యాక్సెసరీలు రూ.49 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు ఇతర గ్యాడ్జెట్లపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అమేజింగ్ టీ-రెక్స్ 2 స్మార్ట్ వాచ్‌ను రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. ఎంఎస్ఐ జీఎఫ్63 థిన్ గేమింట్ ల్యాప్‌టాప్ ఈ సేల్‌లో రూ.67,990కే అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో టీజ్ చేసిన దాని ప్రకారం బోట్ రాకర్జ్ 450ని రూ.990కే కొనుగోలు చేయవచ్చు. అలాగే లెనోవో యోగా స్మార్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ రూ.17,999కే అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో డిస్కౌంట్ కూపన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?