19 Minute Viral Video: సైబర్ నేరాల నుంచి ఎన్ని విధాలుగా భద్రత పొందాలని చూస్తున్నా మరో రూపంలో ప్రజలు దాడి చేసేందుకు క్రిమినల్స్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైరల్ వీడియో పేరుతో సరికొత్త రూపంలో మాల్వేర్ వైరస్‌ పంపించాలని చూస్తున్నారు. ఇలాంటి వీడియోలు క్లిక్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

Continues below advertisement

ప్రజల ఫోన్‌లు, సిస్టమ్స్‌ హ్యాక్ చేసి వారి వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు సరికొత్త ఎత్తుగడతో వస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ 19 నిమిషాలు వైరల్ వీడియో లింక్‌ను జనంలోకి వదిలారు. దీని ద్వారా బ్యాంకింగ్ ట్రోజన్‌లను ఇన్‌స్టాల్ చేసి మోసగించాలని చూస్తున్నారు. మీరు ఆ విడియోపై క్లిక్ చేసి చూస్తే మీకు తెలియకుండానే మాల్‌వేర్ వైర్ల మీ సిస్టమ్‌లోకి వెళ్లిపోతుంది. దీంత మీ బ్యాంకింగ్ లాగిన్స్‌, ఓటీపీలను సైలెంట్‌గా తెలుసుకుంటారు. తర్వాత మీ ఖాతాలను మీ ప్రమేయం లేకుండానే ఖాళీ చేస్తారు. 

సోషల్ ఇంజినీరింగ్ అని పిలిచే ఈ వీడియో లింక్‌ ద్వారా మీ ఫోన్, మీ సిస్టమ్‌ యాక్సెస్‌ను పూర్తిగా వాళ్లకు ఇస్తున్నట్టు చెప్పుకునేలా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. వైరల్ వీడియోలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన కంటెట్ ఉందనిపించే లింక్‌లను వాట్సాప్, టెలిగ్రామ్, వేరే ప్రైవేటు మెసేజింగ్ యాప్‌ల ద్వారా మీకు చేరవేస్తారు. మీరు దానిపై క్లిక్ చేస్తే మీకు తెలియకుండానే బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉంచిన ట్రోజన్ హార్స్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. 

Continues below advertisement

సైబర్ నేరగాళ్లు పంపించే లింక్‌లలో ఎలాంటి ఆసక్తికరమైన వీడియో ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే మాత్రం వారి ఉద్దేశం నెరవేరుతుంది. మీరు క్లిక్ చేసినప్పుడల్లా మీ ఫోన్‌ అనుమతులు వారికి ఇస్తున్నట్టు సెట్టింగ్ మారుతుంటాయి. దీని వల్ల మీ ఫోన్ ప్రమాదంలో పడుతుంది. నిర్వహణ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. దీంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. 

వీడియో డిజిటల్ ఫిషింగ్‌

సైబర్ నేరగాళ్లు ఎలక్ట్రానిక్ ఫిషింగ్‌ టెక్నిక్‌లో రాటుదేలారు. జనాలకు ఆసక్తి ఉండే కంటెంట్‌ను క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు. ఏదో విషయంపై లీక్ అయిన 19 నిమిషాల వీడియో అనే విధంగా సర్క్యులేట్ అవుతుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు మొదట్లో ఏం కనిపించదు. అయితే మీరు క్లిక్ చేసిన ప్రతి సారీ మీకు తెలియకుండానే నకిలీ ల్యాండింగ్ పేజ్‌లలో మీ వివరాలు చేరిపోతుంటాయి. కొన్ని సార్లు వీడియో మాదిరిగా కనిపించే పేజ్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసినా మీ ఫోన్‌లోకి బ్యాంకింగ్ ట్రోజన్ లేదా ఇన్ఫోస్టిలర్‌ వంటి లోడ్‌ను పొందుతారు. బ్యాంక్ గ్రౌండ్‌లో జరిగే మతలబు తెలియక వినియోగదారుడు ఆ వీడియో కోసం క్లిక్ చేస్తూనే ఉంటాడు. ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 

ఈ లింక్‌లు క్లిక్ చేసినప్పుడు మీకు తెలియకుండానే స్క్రీన్ ఒక్కసారిగా బ్లాంక్ అవుతుంది. లేదా మీ స్క్రీన్‌ను పోలిన నకిలీ స్క్రీన్ లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. వాటిపై మీరు వాటిపై పాస్‌వర్డ్‌, ఇతర ఓటీపీలు టైప్ చేసినప్పుడు మీ డేటా ఆధారంగా అప్పటికే మీ ఒరిజినల్‌ స్క్రీన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు తమ పని కానిచ్చేస్తారు. మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు. దీనంతటికీ మీకు తెలియకుండానే మీరే వాళ్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చి ఉంటారు. ఈ మాల్‌వేర్ మీరు పెట్టుకున్న సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను బ్రేక్ చేయగలదు. అందుకే గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు కానీ, అనుమానాస్పద లింక్‌లు కానీ క్లిక్ చేయకుండా ఉంటేనే మీఫోన్ , మీ బ్యాంకు ఖాతాలో నగదు సురక్షితంగా ఉంటుంది.