Lost Smartphone in Train: భారతదేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లో రోజూ కోట్ల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. చాలా మందికి ఈ ప్రయాణం చాలా భిన్నమమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ప్రయాణంలో వస్తువులు పోతే అది జీవితాంతం చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇలా పోయిన వస్తువుల్లో మొబైల ఫోన్ ఉంటే.... అది మరో పెద్ద విషాధంగా భావిస్తాం. వస్తువులు పోతే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి మొబైల్స్ పోతే పరిస్థితి ఏంటీ?
రైలులో చోరీకి గురైన ఫోన్ తిరిగి పొందడం చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వే సరికొత్త ఆలోచన చేసింది. దొంగతనానికి గురైన ఫోన్‌లను కనిపెట్టేందుకు వాటిని బాధితులకు ఇచ్చేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్ మదద్ యాప్(Rail Madad) పేరుతో సరికొత్త యాప్‌ను డిజైన్ చేసింది. లేటెస్ట్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఈ యాప్ తీసుకొచ్చింది. చోరీ బారిన పడిన ఫోన్‌ను ఇతర వస్తువులను తిరిగి పొందే అవకాశాలను మెరుగుపరుస్తుందీ యాప్.
గేమ్-ఛేంజింగ్ ఇనిషియేటివ్ ఏప్రిల్ 2025లో ఇండియన్ రైల్వేస్, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సహకారంతో రైల్ మదద్ యాప్ క్రియేట్ చేసింది. రైళ్లు, రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో మొబైల్ దొంగతనాలు పెద్ద సమస్యగా గుర్తించిన రైల్వే శాఖ దాని పరిష్కారం కోసం ఈ విప్లవాత్మక సేవ ప్రారంభించింది. రైల్ మదద్ యాప్ ప్రయాణీకుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడానికి రూపొందించింది. ఇప్పుడు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను తిరిగి పొందడానికి అత్యాధునిక టెక్నాలజీతో అప్‌డేట్ చేశారు. DoTకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌తో అనుసంధానించి ఉంటుందీ యాప్. ప్రయాణీకులు పోగొట్టుకున్న, చోరీకి గురైన వస్తువులపై తక్షణం ఫిర్యాదు చేసేందుకు వీలు కలిగిస్తుంది. మొబైల్ చోరీకి గురైతే వెంటనే బ్లాక్ చేసేలా సహాయపడుతుంది. తర్వత టెలికాం నెట్‌వర్క్‌ల్లో దాన్ని ట్రాక్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది.
ఇప్పటికే ఈ రైల్ మదద్ యాప్‌ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 2024 నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ టైంలో చోరీకి గురైన , పోగొట్టుకున్న చాలా ఫోన్‌లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది బాధితులకు తిరిగి ఇచ్చారు. దొంగలను కూడా పట్టుకున్నారు. ఫలితంగా సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇది మొత్తం 17 RPF జోన్‌లు, 70 కంటే ఎక్కువ డివిజన్‌లను కవర్ చేస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుంది ఈ రైల్ మదద్ యాప్ వాడే ప్రక్రియ చాలా సులభమైంది. ప్రయాణీకులు తమ ఫోన్ పోయిందని తెలిసినప్పుడు వారు తమకు తెలిసిన వారి ఫోన్ నుంచి ఫిర్యాదు చేయవచ్చు. Android, iOS లలో ఉచితంగా అందుబాటులో ఉంటుందీ రైల్ మదద్ యాప్. ఈ యాప్ ఓపెన్ చేసి ఫిర్యాదు చేవచ్చు. లేదా 139 రైల్వే హెల్ప్‌లైన్‌కు డయల్ చేయవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని వివరాలు అడుగుతుంది వాటిని ఇవ్వాల. మీరు ప్రయాణం చేసే రైలు నంబర్, దొంగతనం జరిగిన స్టేషన్(తెలిస్తే), ఫోన్ IMEI నంబర్, ఇది ట్రాకింగ్‌కు చాలా ముఖ్యమైనది.
ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, అది CEIR పోర్టల్‌తో అటోమెటిక్‌గా లింక్ చేస్తంది. తద్వార పోయినా లేదా చోరీకి గురైన ఫోన్ IMEIని బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫోన్‌లో ఏ సిమ్ వేసిన పని చేయదు. అదే టైంలో RPF జోనల్ సైబర్ సెల్‌లు లైన్‌లోకి వస్తాయి. బ్లాక్ చేసిన మొబైల్ ఏ టెలికాం నెట్‌వర్క్‌లో ఉందో పర్యవేక్షిస్తాయి. దొంగ చోరీ చేసిన మొబైల్లో కొత్త SIM వేస్తే, సిస్టమ్ దానిని ట్రాక్ చేస్తుంది. ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ఆ తర్వాత RPF స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని మొబైల్‌ను తీసుకుంటారు.
IMEI నంబర్ తెలియకపోయినా మెబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించింది తెలుసుకోవచ్చు. నిమిషాల్లో, ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి ప్రూఫ్‌ల కోసం రైలు టికెట్ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్. పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తాల్సిన అవసరం లేదు.
మొబైల్ దొరికిన వెంటనే ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఫోన్ చేసి చెబుతారు. మీరు మీ ఆధార్ కార్డు లేదా ఇతర ఐడీ కార్డు తీసుకెళ్లి చూపిస్తే మీ ఫోన్ అప్పగిస్తారు. మొబైల్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత CEIR పోర్టల్ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌బ్లాక్ చేయవచ్చు.
2025 జనవరి, ఫిబ్రవరి మధ్య ఆపరేషన్ అమానత్ కింద రైల్వే పోలీసులు రూ. 84.03 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 1.15 లక్షలకు పైగా ప్రయాణికులకు తిరిగి ఇచ్చారు. CEIR ఇంటిగ్రేషన్‌తో మొబైల్ ఫోన్ రికవరీలు విపరీతంగా పెరిగాయి. వేలాది పరికరాలు గుర్తిస్తున్నారు. వందల మంది దొంగలు చిక్కుతున్నారు.
సవాళ్లు ఫోన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ట్రాకింగ్ వీలు కలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసినా విడిభాగాలుగా మార్చినా ట్రాకింగ్ అసాధ్యం అవుతుంది. IMEI నెంబర్ తెలుసుకోవడం సమస్యగా మారుతుంది. ఇదే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ఈ నెంబర్ అవసరాన్ని గుర్తించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తుంటాయి. అన్నీ పరిష్కరించే సిబ్బంది లేకపోవచ్చు. అందుకే ట్రాకింగ్, రికవరీ చేయడంలో తలనొప్పులు ఉంటాయి. ఉన్న సిబ్బందితో ఉత్తమ ఫలితాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని ఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు.
ప్రయాణీకుల భద్రతలో కొత్త యుగంరైల్ మదద్-CEIR కలిసి తీసుకొచ్చిన యాప్ ప్రయాణికులకు భద్రతపై భరోసా ఇస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలకుపైగా పరికరాలు బ్లాక్ చేసింది. 3.87 లక్షల హ్యాండ్‌సెట్‌లను తిరిగి బాధితులకు అప్పగించింది.