Mobile Price Drop: స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించాలని షావోమీ, ఒప్పో, వివో, శాంసంగ్ వంటి పెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలను భారతీయ మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం దేశంలోని కొన్ని అతి పెద్ద మొబైల్ రిటైలర్లు తమ 4జీ మొబైల్ ఫోన్‌ల ధరలను తగ్గించాలని షావోమీ, ఒప్పో, వివో, శాంసంగ్, ఇతర బ్రాండ్‌లను అభ్యర్థించారు. మంచి ఆఫర్లు అందించి మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా పేరుకుపోతున్న 4జీ హ్యాండ్‌సెట్‌ల స్టాక్‌ని క్లియర్ చేయడంలో కంపెనీలు సహాయపడాలని డిమాండ్ చేశారు.


ఏ ఫోన్ల ధర తగ్గాలి?
ముఖ్యంగా రూ.15,000 బడ్జెట్‌లో ఉన్న 4జీ మొబైల్స్ ధరలను తగ్గించాలని మొబైల్ రిటైలర్లు డిమాండ్ చేశారు. వాస్తవానికి ప్రస్తుతం భారతదేశంలో ఈ విభాగంలో చాలా తక్కువ 5జీ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో చాలా కంపెనీలు తమ 5జీ ఫోన్‌లను ఈ విభాగంలో లాంచ్ చేయనున్నాయి. దీని కారణంగా అన్ని రిటైలర్లు తమ 4జీ స్టాక్‌ను క్లియర్ చేయాలని అనుకుంటున్నారు.


ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్... ఒప్పో, వివో, షావోమీ, శాంసంగ్‌తో సహా ఇతర బ్రాండ్‌లకు రాసిన తన లేఖలో ఇలా పేర్కొంది. "ప్రభుత్వ చొరవతో 5జీ టెక్నాలజీ హెడ్‌సెట్లు బడ్జెట్ విభాగంలో అందుబాటులోకి రావడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో 4జీ ఫోన్ల స్టాక్ విక్రయించడం కష్టం కావచ్చు." అన్నారు. మొబైల్ రిటైలర్ల ప్రకారం ప్రస్తుతం కొత్త ఫోన్ కొనాలనుకునే వారిలో 80 శాతం మంది 5జీ స్మార్ట్‌ఫోన్‌లను డిమాండ్ చేస్తున్నారు. దీని కారణంగా 4జీ ఫోన్‌లను విక్రయించడం కష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.


కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో రూ. 10,000 కంటే తక్కువ ధరలో అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌ల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే 5జీ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అయితే ఈ సంఖ్య 2024లో 14 శాతానికి, 2025లో 45 శాతానికి వేగంగా పెరుగుతుందని అనుకోవాలి.


మరోవైపు మెయిజు 21 గేమింగ్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో ఇటీవలే అధికారికంగా లాంచ్ చేశారు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. 12 జీబీ వరకు ర్యామ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు చూడవచ్చు. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్‌గా ఉంది. నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో మెయిజు 21ని కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ54 రేటెడ్ బిల్ట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!