Microsoft VASA 1 AI Tool: మైక్రోసాఫ్ట్ వాసా-1 అనే కొత్త సర్వీసును మార్కెట్లో లాంచ్ చేసింది. వాసా-1 అనేది స్టిల్ చిత్రాల నుంచి నేరుగా మానవ ముఖాల వీడియోలను సృష్టించగల ఏఐ టూల్. ఈ ఏఐ టూల్ ఆడియో క్లిప్‌ను తీసుకున్నప్పుడు మానవుల నిజమైన వ్యక్తీకరణలు, భావోద్వేగాలు మొదలైనవాటిని కూడా సరిగ్గా సింక్ చేయగలదు. మైక్రోసాఫ్ట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వాసా-1కు సంబంధించిన అనేక నమూనాలను షేర్ చేసింది. ప్రజలు దీన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయారు.


మైక్రోసాఫ్ట్ వాసా-1 ఏఐ వీడియో జనరేటర్
వాసా-1 ఫుల్ ఫాం విజువల్ ఎఫెక్టివ్ స్కిల్స్ ఆడియో-1. ఇది కంపెనీ రూపొందించిన టాప్ ఏఐ మోడల్. దీన్ని ప్రత్యేకంగా మనుషుల ముఖ కవళికల కోసం రూపొందించారు. ఇది ఫేస్ డైనమిక్స్ ద్వారా విస్తృతమైన భావాలు, భావోద్వేగాలను సృష్టించగలదు. ఇందులో ముఖ కండరాలు, పెదవులు, ముక్కు, తల వంపు వంటి అనేక ఇతర అంశాలు ఉన్నాయి.


ఈ వీడియోలో మీరు కేవలం ఒక వ్యక్తి ఫొటోని, అతని స్వరాన్ని కలపడం ద్వారా ఈ ఏఐ టూల్ ఎటువంటి వీడియోను ఎలా రూపొందించిందో చూడవచ్చు. ఈ వీడియో నిజమైనది కాదని చెప్పడం దాదాపు అసాధ్యం.






Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 


ఫేక్ వీడియోలు చేయడం చాలా సులభం
ఈ వీడియోలో కూడా మీరు ఒక మహిళకు సంబంధించిన ఫొటోని, ఆమె ఆడియో క్లిప్‌ను జోడించడం ద్వారా మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన ఈ ఏఐ సాధనం 59 సెకన్ల వీడియోను రూపొందించినట్లు మీరు చూడవచ్చు. ఈ వీడియో చూస్తుంటే ఇది పూర్తిగా నిజమైన వీడియో అనిపించేలా ఉంది.


ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఈ కొత్త ఏఐ టూల్‌ని ఉపయోగించి, కేవలం ఒక ఫొటో, ఆడియో క్లిప్ సాయంతో ఒక వ్యక్తి నిజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియోను ఎలా రూపొందించవచ్చో చూపించారు. ఈ టూల్ సహాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను తయారు చేయడం చాలా సులభం అని ఈ వీడియో క్యాప్షన్‌లో రాసింది. మైక్రోసాఫ్ట్ వాసా-1 ఏఐ వీడియో జనరేటివ్ టూల్ సహాయంతో మనుషుల నకిలీ వీడియోలని ఎలా సృష్టించవచ్చో దీన్ని చూస్తే మీకే అర్థం అవుతుంది.


వాసా-1 ప్రస్తుతం 40 ఎఫ్‌పీఎస్ వద్ద గరిష్టంగా 512×512 పిక్సెల్ రిజల్యూషన్‌తో మాత్రమే వీడియోను రూపొందించగలదు. నిజ జీవితానికి వీలైనంత దగ్గరగా వీడియోలను రూపొందించేలా ఈ టూల్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 







Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు