Copilot Pro Rolled out: మైక్రోసాఫ్ట్ రూపొందించిన ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫాం కోపైలట్ ప్రోను కంపెనీ 222 దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వ్యక్తిగత వినియోగంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని మొదట 2024 జనవరిలో లాంచ్ చేశారు. అప్పట్లో ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే దీన్ని తెచ్చారు. ప్రస్తుతం దీన్ని పూర్తిస్థాయిలో తీసుకువచ్చింది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ 365 వెబ్ యాప్స్‌ను ఉపయోగించవచ్చు.


మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ధర
దీని సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు రూ.2,000గా నిర్ణయించారు. వ్యక్తిగత వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు. అదే కంపెనీ తీసుకోవాలంటే ఉపయోగించే యూజర్స్ సంఖ్యను బట్టి సబ్‌స్క్రిప్షన్ ఉండనుంది. వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌లో దీన్ని ఉపయోగించవచ్చు. కోపైలట్ మొబైల్ యాప్స్‌పై వన్ మంత్ ఫ్రీ ట్రయల్ కూడా అందుబాటులో ఉండనుంది.


మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ఫీచర్లు
మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ప్రధాన ఆకర్షణ ఏంటంటే మైక్రోసాఫ్ట్ 365 వెబ్ యాప్స్‌ను కూడా యూజ్ చేయవచ్చు. వర్డ్, అవుట్‌లుక్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఇతర వెబ్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏఐ టూల్‌ను పీసీ లేదా మ్యాక్‌లో ఉపయోగించుకోవాలంటే మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్, ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఈ ఫీచర్‌ను ఉచిత మొబైల్ యాప్స్‌కు కూడా కంపెనీ ఎక్స్‌టెండ్ చేసింది.


ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ టెక్ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరుగుతోంది. ఓపెన్ఏఐ లాంచ్ చేసిన ఛాట్‌జీపీటీ ఈ పోటీని మరింత తీవ్రతరం చేసిందని చెప్పాలి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ గ్యాంగ్‌లో జాయిన్ అయింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే మొబైల్ ఏఐ యాప్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది.


మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్... ఓపెన్ఏఐ ఛాట్‌జీపీటీ యాప్‌ని పోలి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌ల్లో దీన్ని యాక్సెస్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్‌ను గతంలో బింగ్ చాట్ అని పిలిచేవారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ పేరుతో మరి కొన్ని అప్‌డేట్‌లతో ఈ యాప్‌ను కంపెనీ తిరిగి లాంచ్ చేసింది. కోపైలట్ ఏఐ యాప్ కూడా ఛాట్‌జీపీటీ ఏఐ తరహాలోనే పనిచేస్తుంది. కోపైలట్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి కూడా డౌన్‌లోడ్ చేయవచ్చు.


కోపైలట్ ప్రో సర్వీసులో వినియోగదారులు క్విక్ రియాక్షన్స్, జీపీటీ-4, జీపీటీ టర్బో-4 వంటి తాజా మోడళ్లకు యాక్సెస్ పొందుతారు. మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన కోపైలట్ ప్రో కంపెనీలకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కంపెనీలు చేసే అనేక పనులను సులభతరం చేయనుంది. మరోవైపు ఛాట్‌జీపీటీ ప్లస్ సర్వీసు డెవలపర్‌లు, సాధారణ వినియోగదారులకు చాలా బాగుంటుంది. మీరు చేసే పనిని బట్టి మీకు అవసరమైన సర్వీసును ఎంచుకోవచ్చు.


Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?