Microsoft Copilot Android: టెక్ దిగ్గజాలు కంపెనీలు అన్నీ ఏఐ రేసులో తమను తాము ముందంజలో ఉంచుకోవాలని అనుకుంటున్నాయి. ఏఐ రంగంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌ను కోపైలట్‌గా రీబ్రాండ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ఛాట్‌జీపీటీని పోలి ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ యాప్‌ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


కోపైలట్‌కు, ఛాట్‌జీపీటీకి తేడా ఏంటి?
మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్‌లో మీరు ఛాట్‌జీపీటీ వంటి ప్రశ్నలు అడిగే సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ఇమేజ్ క్రియేషన్, ఈ-మెయిల్స్, డాక్యుమెంట్‌ల కోసం డ్రాఫ్ట్ నోట్స్, డాల్-ఈ 3 ద్వారా జీపీటీ-4 సౌకర్యాన్ని కలిగి ఉంది. జీపీటీ-4 అనేది ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీలో పేమెంట్ ఫీచర్. అయితే ఇది కోపైలట్‌లో ఉచితం. ప్రస్తుతం కంపెనీ ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. ఈ యాప్ రాబోయే కాలంలో ఐవోఎస్ వినియోగదారుల కోసం కూడా అందుబాటులోకి రావచ్చు.


ఆండ్రాయిడ్‌లో కోపైలట్ ఇంటర్‌ఫేస్
యాప్‌ని ఉపయోగించడానికి మీరు లాగిన్ అవ్వాలి. దీన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు కంపెనీ వెబ్‌సైట్ నుంచి కూడా కోపైలట్‌ను యాక్సెస్ చేయవచ్చు. దీని కోసం మీరు copilot.Microsoft.comకి వెళ్లాలి. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ ఖాతా, స్కైప్ లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేయవచ్చు.


కోపైలట్‌తో పాటలను కూడా...
వాస్తవానికి కంపెనీ కేంబ్రిడ్జ్ ఆధారిత ఏఐ మ్యూజిక్ స్టార్టప్ సునోతో భాగస్వామ్యం కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ వినియోగదారులు ఈ భాగస్వామ్యం నుంచి ప్రయోజనం పొందుతారు. వారు కంపెనీ ఛాట్‌బోట్ ద్వారా ఏఐ పాటలను సృష్టించగలరు. ముందుగా మీరు కోపైలట్‌కి లాగిన్ చేసి, ఆపై టర్న్ ఆన్ సునో ప్లగిన్ లేదా మేక్ మ్యూజిక్ విత్ సునో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టెక్స్ట్ ప్రాంప్ట్‌ను నమోదు చేయాలి. ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ చాలా చిన్నదిగా, అర్థమయ్యేలా ఉండాలి.


మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొంతకాలం క్రితం 'చాట్ లాక్' ఫీచర్‌ని తీసుకువచ్చింది. ఇప్పుడు దీనికే కొత్త అప్‌గ్రేడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే ఛాట్ లాక్ చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన లిస్ట్ పైన ఒక ఫోల్డర్‌లో కనిపిస్తుంది. అందులో లాక్ చేయబడిన చాట్‌లు చూడవచ్చు. ఇక్కడ మీరు చాట్‌లను లాక్ చేశారని ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ సమస్యకు ముగింపు పలకడానికి వాట్సాప్ మరో కొత్త ఫీచర్ 'హైడ్ లాక్ ఫోల్డర్'ను ప్రవేశపెట్టింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!