డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‌లో ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ట్విట్టర్ ఆయన ఖాతాను తిరిగి తీసుకువచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లోకి తిరిగొచ్చాక ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ మీమ్స్‌తో నిండిపోయింది.
ఎలాన్ మస్క్ చెప్పిన ఒపీనియన్ పోల్‌లో ఏకంగా 1.5 కోట్ల మంది యూజర్లు పాల్గొనడం విశేషం. వీరిలో 51.8 శాతం మంది ట్రంప్ తిరిగి రావాలని ఓట్ చేయగా, 48.2 శాతం మంది వద్దని ఓట్ చేశారు. మెజారిటీ ప్రజలు ఎంచుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు.
యూఎస్ కాపిటల్ వద్ద ట్రంప్ అనుకూల మద్దతుదారులు తిరుగుబాటుకు ప్రయత్నించిన కొద్ది రోజుల తర్వాత 2021 జనవరిలో ట్రంప్‌ను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేశారు. ట్రంప్‌కు ట్విట్టర్‌లో 88 మిలియన్ల ఫాలోవర్లకు పైగా ఉన్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తాను ట్విట్టర్‌కు తిరిగి రానని, ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తాను ప్రారంభించిన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌కు కట్టుబడి ఉంటానని చెప్పారు.