Longest Phone Call Conversation: స్మార్ట్‌ఫోన్ నేడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అది లేకుండా అంతా అసంపూర్ణంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ల ద్వారా మనం ఒకరి నుంచి ఒకరు వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లు ఇలా ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉంటే మనం కొన్ని నిమిషాల్లో ప్రపంచంలో ఏ మూల జరిగే విషయాలు అయినా తెలుసుకోవచ్చు. మీరందరూ మీ మొబైల్ ఫోన్ నుండి ఏదో ఒక సమయంలో 10 లేదా 20 నిమిషాల పాటు ఎవరికైనా కాల్ చేసి ఉంటారు.
కొంతమంది తమ స్నేహితులతో, మరికొందరు వారి కుటుంబ సభ్యులతో లేదా వారి ప్రేమించిన వారితో సుదీర్ఘ సంభాషణలు చేస్తారు. గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఎవరైనా ఫోన్ కాల్‌లో ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే మాట్లాడగలరు. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫోన్ కాల్ (వ్యక్తిగతంగా) ఎంతసేపు ఉందో తెలుసా?
హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎరిక్ ఆర్. బ్రూస్టర్, అవరీ ఎ. లియోనార్డ్‌లు 46 గంటల 12 నిమిషాల 52 సెకన్ల 228 మిల్లీసెకన్ల పాటు ఒకరితో ఒకరు కాల్ మాట్లాడుకున్నారు 2012లో ఈ అత్యంత పొడవైన ఫోన్ కాల్ రికార్డ్ అయింది. కాల్ మాట్లాడినంత సేపు వీరిద్దరూ 10 సెకన్లకు మించి మౌనంగా లేరు. అయితే ప్రతి గంట తర్వాత వారు శక్తిని తిరిగి పొందడానికి ఐదు నిమిషాల విరామం ఇచ్చారు. వాస్తవానికి ఇది ఒక చిట్ చాట్ షో.
అంతకుముందు 2009లో సునీల్ ప్రభాకర్ అత్యధిక సేపు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అతను దాదాపు 51 గంటల పాటు ఫోన్ కాల్‌లో మాట్లాడాడు. కానీ అతను వేర్వేరు వ్యక్తులతో కాల్ మాట్లాడాడు. ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ అయ్యేది.