Lava X2: లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభించనుంది. ఈ సిరీస్‌లో మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ అంటోంది. దీన్ని కేవలం బడ్జెట్ వినియోగదారుల కోసం తయారు చేసినట్లు లావా తెలిపింది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల  హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను కంపెనీ ఇందులో అందించింది.


లావా ఎక్స్2 ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. అయితే మార్చి 11వ తేదీ వరకు అమెజాన్‌లో ఈ మొబైల్ రూ.6,599కే కొనుగోలు చేయవచ్చు. బ్లూ, సియాన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్, లావా ఈ-స్టోర్‌ల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


లావా ఎక్స్2 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఇందులో అందించారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. 


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మరో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఓటీజీ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం... ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.9 సెంటీమీటర్లు కాగా... బరువు 192 గ్రాములుగా ఉంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!