Website Cookies : మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడల్లా, ఒక పాప్-అప్ బ్యానర్ కనిపిస్తుంది. మీరు కికీస్‌ను అంగీకరించాలనుకుంటున్నారా లేదా తిరస్కరించాలనుకుంటున్నారా అని అందులో రాసి ఉంటుంది. చాలా మంది దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించరు. కొన్నిసార్లు అంగీకరిస్తారు, మరికొన్నిసార్లు తిరస్కరిస్తారు. కానీ వాటిని అంగీకరించడం లేదా తిరస్కరించడం వల్ల చాలా తేడా వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఎంపికతో, ఒక వెబ్‌సైట్ మీ కోసం ఎలా పని చేస్తుందో? మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిల్వ చేస్తుందో నిర్ణయిస్తుంది  ఇది మిమ్మల్ని పదేపదే లాగిన్ అవ్వడం నుంచి కాపాడుతుంది. అలాగే మీకు పదేపదే ప్రకటనలను కూడా చూపించవచ్చు.

Continues below advertisement


కుకీస్‌ అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి?


కుకీస్‌ చిన్న ఫైల్‌లు, వీటిని వెబ్‌సైట్‌లు మీ టూల్‌లో స్టోర్ చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, వెబ్‌సైట్ సరిగ్గా పనిచేసేలా చూడటం దీని ప్రధాన పని. ఇవి ఎసెన్షియల్, ఫంక్షనల్, అనలిటిక్స్, అడ్వర్టైజింగ్ సహా నాలుగు రకాలు. వాటి పని ఏమిటంటే:


ఎసెన్షియల్ కుకీస్‌- వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడానికి ఇవి అవసరం. వీటిని తిరస్కరించలేరు.


ఫంక్షనల్ కుకీస్‌ - భాష, ప్రాంతీయ ప్రాధాన్యత వంటి సమాచారాన్ని నిల్వ చేయడం దీని పని.


అనలిటిక్స్ కుకీస్‌- వినియోగదారుల సైట్‌తో పరస్పర చర్యకు సంబంధించిన డేటాను నిల్వ చేస్తాయి.


అడ్వర్టైజింగ్ కుకీస్‌- ఇవి బ్రౌజింగ్‌ను ట్రాక్ చేస్తాయి. వినియోగదారులకు లక్షిత ప్రకటనలను చూపుతాయి. 


అంగీకరించడం లేదా తిరస్కరించడం వల్ల ఏమి జరుగుతుంది?


మీరు పాప్-అప్ వచ్చినప్పుడు అన్నింటినీ అంగీకరిస్తే, ప్రతి రకం కుకీస్‌కు పూర్తి యాక్సెస్ లభిస్తుంది. అంటే, ప్రకటనకర్తలు, మూడో పార్టీలు కూడా మీ బ్రౌజింగ్‌ను ట్రాక్ చేయవచ్చు. దీని ఆధారంగా, మీకు టార్గెటెడ్‌ ప్రకటనలు డిస్‌ప్లే అవుతాయి. అదే సమయంలో, మీరు అన్నింటినీ తిరస్కరిస్తే, మీ గోప్యత అలాగే ఉంటుంది, కానీ వెబ్‌సైట్‌లో మీ అనుభవం పరిమితం కావచ్చు. మీరు ప్రతిసారీ లాగిన్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.