Huawei MateBook Fold S: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల తర్వాత ఇప్పుడు ఫోల్డబుల్ కంప్యూటర్ టెక్నాలజీ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. టెక్ దిగ్గజం హువావే తన సరికొత్త ఫోల్డబుల్ పీసీ మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ (MateBook Fold S) ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవసరాన్ని బట్టి పెద్ద ల్యాప్‌టాప్‌గా, ఫోల్డ్ చేసినప్పుడు కాంపాక్ట్ నోట్‌బుక్‌గా మార్చుకునేలా దీనిని రూపొందించారు.
1. డిజైన్, ట్విన్ డిస్‌ప్లే
హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ డిజైన్ కంపెనీ అంతకు ముందు 'మేట్‌బుక్ ఫోల్డ్ అల్టిమేట్' పీసీని పోలి ఉంటుంది. దీనిని పూర్తిగా ఓపెన్ చేస్తే 14.7 ఇంచుల ఫ్లెక్సిబుల్ OLED స్క్రీన్ కనిపిస్తుంది. UTG త్రీ-లేయర్ టెక్నాలజీతో ఈ డిస్‌ప్లే 3240 x 2160 పిక్సెల్ రిజెల్యూషన్, 1-120Hz LTPO రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ మ్యాక్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను మూసివేసినప్పుడు ఇది 10.2 ఇంచుల కాంపాక్ట్ నోట్‌బుక్‌గా మారుతుంది. దీని కవర్ భాగంలో 980 x 980 పిక్సెల్ రిజెల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన ప్రత్యేక స్క్రీన్ ఉంది. దీనికి కంపెనీ 'లైవ్ స్మాల్ స్క్వేర్ స్క్రీన్' అని పేరు పెట్టింది.
దీనిని సులభంగా నిలబెట్టి ఉపయోగించుకోవడానికి వెనుక వైపున బిల్ట్-ఇన్ స్టాండ్ ఉంది. ఫిజికల్ కీబోర్డ్ కోరుకునే వారి కోసం టచ్‌ప్యాడ్, ఎం-పెన్సిల్ స్టైలస్ సపోర్ట్‌తో ఫోల్డబుల్ కీబోర్డ్‌ను కూడా అందించారు.
2. కిరిన్ XE90 ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్
హార్మొనీఓఎస్ బేస్డ్ పీసీలో హువావే సొంత కిరిన్ XE90 చిప్‌సెట్‌ను అమర్చింది. పాత తరం ప్రాసెసర్లతో పోలిస్తే ఇది సింగిల్ కోర్ పనితీరును 23 శాతం, NPU పనితీరును 40 శాతం మెరుగుపరుస్తుందని, అలాగే 25 శాతం ఎక్కువ పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 16GB నుంచి 32GB వరకు RAM, 256 GB నుంచి 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. 22W వరకు విద్యుత్ వినియోగంతో నిరంతరాయ పనితీరును అందించడానికి యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది.
3. కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్
సాధారణ ల్యాప్‌టాప్‌లకు భిన్నంగా ఇందులో హై ఎండ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ లెన్స్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉన్నాయి. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 55 శాతం, 65 నిమిషాల్లో 100 శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుందని హువావే తెలిపింది. Also Read: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
4. వేరియంట్లు, ధరలు
హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ నవంబర్ 27 సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- 16GB RAM + 256GB స్టోరేజీ - రూ. 1.87 లక్షలు
- 16GB RAM + 512GB స్టోరేజీ - రూ. 2.12 లక్షలు
- 32GB RAM + 1TB స్టోరేజీ (టాప్ మోడల్) - రూ. 2.87 లక్షలు Also Read: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
