Amazon Great Freedom Sale 2025 : అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీ సమయంలో వచ్చినట్టే.. ఈ సంవత్సరం కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌తో వచ్చారు. ఈ సేల్‌లో వివిధ వస్తువులపై, ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. Lenovo, Acer, Dell, Jio వంటి టాప్ బ్రాండ్‌లు ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు ఇచ్చాయి. ఈ సేల్‌లో డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ల ద్వారా కూడా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు ఉత్తమ సమయం. 11 వేల నుంచి ప్రారంభమై.. వివిధ బెస్ట్ డీల్స్ సేల్‌లో మీరు చూడవచ్చు.
JioBook
జియో బుక్ 11 – కేవలం ₹11,999లకే అందుబాటులో ఉంది. దాదాపు 52 శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. ఈ జియో బుక్ ప్రాసెసర్ MediaTek 8788 ఆక్టా-కోర్తో వచ్చింది. 4GB RAM / 64GB నిల్వతో వస్తుంది. Android ఆధారిత OS, 4G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఫీచర్లతో వస్తుంది. దీని ధర డీల్ తర్వాత 11,999 వస్తుంది. విద్యార్థులు, ప్రాథమిక వినియోగదారులకు అద్భుతమైన ఎంపిక.
Dell Inspiron 3535
Dell Inspiron 3535 ధర 39,990. డిస్కౌంట్ 17% ఉంది. AMD Ryzen 5-7530U ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుంది. RAM స్టోరేజ్ 16GB RAM / 512GB SSD. 15.6" FHD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Windows 11 ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ ట్యాప్ అధిక పనితీరు కలిగిన వినియోగదారులకు మంచి ఎంపిక.
Lenovo Smartchoice Ideapad Slim 3
Lenovo Smartchoice Ideapad Slim 3 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో 61,990 ఉంటుంది. 31వ శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. Intel Core i7 ప్రాసెసర్‌తో 16GB RAM / 512GB SSD RAM స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, Windows 11 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, భారీ టాస్క్‌ల చేసే వారికి ఇది మంచి ఎంపిక.
Acer Aspire Lite
Acer Aspire Lite ధర 26,990. 44 శాతం డిస్కౌంట్‌తో సేల్‌లో అందుబాటులో ఉంది. AMD Ryzen 3 7330U ప్రాసెసర్‌తో వచ్చింది. 8GB RAM / 512GB SSD RAM స్టోరేజ్‌తో వచ్చింది. 15.6" Full HD డిస్‌ప్లే, Windows 11 Home ఫీచర్లతో వచ్చింది. మిడ్-రేంజ్ వినియోగదారులకు వాల్యూ ఫర్ మనీ డీల్‌గా ఇది చెప్పవచ్చు.
బ్యాంక్ ఆఫర్స్ కూడా
మీరు ఈ ల్యాప్‌ట్యాప్‌లను బ్యాంక్ ఆఫర్స్‌తో కూడా మరింత బెస్ట్ డీల్స్‌కి బుక్ చేసుకోవచ్చు. SBI కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు.. మీరు పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. మీరు మరింత ఆదా చేసుకోవచ్చు.