జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్‌కు రిలయన్స్ జియో మూడు కొత్త పోస్ట్‌పెయిడ్ నెలవారీ రీచార్జ్ ప్లాన్లను  అందుబాటులోకి తీసుకువచ్చింది. అవే రూ.249, రూ.299, రూ.349 ప్లాన్లు. వీటిలో రూ.249 ప్లాన్ రూ.30 జీబీ డేటాను అందించనుంది. ఇక రూ.299 ప్లాన్ 40 జీబీ డేటాను, రూ.349 ప్లాన్ 50 జీబీ డేటాను అందించనుంది.


ఈ మూడు ప్లాన్ల వ్యాలిడిటీ ఒక నెల మాత్రమే. కానీ లాక్ ఇన్ పీరియడ్ మాత్రం 18 నెలలుగా ఉంది. ఇక రూ.299 పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్ ద్వారా 40 జీబీ డేటా పొందవచ్చు. రూ.349 ప్లాన్ 50 జీబీ డేటాను అందించనుంది. డేటా సీలింగ్ లిమిట్‌ను దాటాక స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.


ఈ ప్లాన్లతో పాటు జియోఫై డివైస్‌ను వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. యూజ్ అండ్ రిటర్న్ పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్లతో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు లభించవు. వీటిని సంస్థలు, బిజినెస్ కస్టమర్లే లక్ష్యంగా రూపొందించారు.


జియోఫై పోస్ట్‌పెయిడ్ టారిఫ్ ప్లాన్లు ఉపయోగించుకోవాలంటే కనీసం 200 జియోఫై యూనిట్లను మొదటగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ 150 ఎంబీపీఎస్‌ వరకు వేగాన్న ఐదు నుంచి ఆరు గంటల వరకు అందించగలదని తెలుస్తోంది. ఒకేసారి 10 డివైస్‌లకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.


మైక్రో యూఎస్‌బీ పోర్టు, మైక్రో ఎస్‌డీ కార్డులను కనెక్టివిటీ కోసం అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 2300 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 1.6 సెంటీమీటర్లుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!