Jio vs Airtel 299 Recharge Plan: ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్‌ఫోన్ వాడటం అసంపూర్ణం అనే చెప్పాలి. డేటా బ్యాలెన్స్ అయిపోతే ఫోన్ పనికిరాని పెట్టెలా కనిపిస్తుంది. ప్రజలు కాలింగ్, ఇంటర్నెట్ కోసం వారి సిమ్‌లకు రీఛార్జ్ చేస్తారు. జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలోని రెండు పెద్ద టెలికాం కంపెనీలు. ఇక్కడ వినియోగదారులు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను పొందుతారు. ఇందులో రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ ప్లాస్. ఇది ఒక నెలవారీ ప్లాన్. రెండు నెట్‌వర్క్‌ల్లోనూ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు.
జియో రూ.299 ప్లాన్ లాభాలు
రిలయన్స్, జియో టెలికాం కంపెనీలు రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తాయి. ఈ మంత్లీ ప్లాన్ కింద మీరు కాలింగ్, ఇంటర్నెట్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. జియో రూ.299 ప్యాక్ 56 జీబీ డేటాను అందిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 56 జీబీ అన్నమాట.
5జీ సర్వీస్ ఏరియాలో మీరు ఉంటే అన్‌లిమిటెడ్ 5జీ డేటా సౌకర్యాన్ని కూడా పొందుతారు. జియో తన వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో టీబీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ లాభాలు
ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. రూ.299 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే మీరు ప్రతిరోజూ 1.5 GB డేటా పొందుతారు. ఈ ప్లాన్‌తో 100 ఎస్‌ఎంఎస్ కూడా డైలీ అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్, హలో ట్యూన్స్ ఉచిత సభ్యత్వం కూడా అందుబాటులో ఉంది.
జియో, ఎయిర్‌టెల్‌ల్లో ఏది బెస్ట్ ప్లాన్?
ఈ రెండు ప్లాన్లను కంపేర్ చేస్తే... ఈజీగా జియో అందిస్తున్న ప్లానే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్‌టెల్ ప్లాన్ ద్వారా నెలకు 1.5 జీబీ డేటా మాత్రమే లభించనుంది. జియో ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందించనున్నారు. మిగతా లాభాలన్నీ దాదాపు సేమ్ ఉన్నాయి.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది