Reliance Jio: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ప్రత్యేక ట్రూ 5జీ అప్‌గ్రేడ్ గిఫ్ట్ వోచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.601గా ఉంది. ఈ వోచర్ ప్రత్యేకత ఏంటంటే... దీన్ని మీ కోసం ఉపయోగించుకోవచ్చు లేదా మరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు ఈ వోచర్‌ని ఎవరికైనా బహుమతిగా ఇచ్చినప్పుడు అది వారి మై జియో అకౌంట్‌కు యాడ్ అవుతుంది.


అసలు రూ. 601 అప్‌గ్రేడ్ వోచర్ వల్ల వచ్చే లాభాలు ఏంటి?
ఈ వోచర్ ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌లో ఉంటూ... జియో అందించే 5జీని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది. జియో ప్రస్తుతం 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లపై మాత్రమే 5జీ సేవలను అందిస్తోంది. 1.5 జీబీ డైలీ డేటాతో ప్లాన్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు ఈ వోచర్ సహాయంతో 5జీని ఆనందించవచ్చు.


రూ.601 వోచర్ అనేది మొత్తంగా 12 చిన్న వోచర్ల ప్యాకేజీ. వీటిలో ఒక్కో వోచర్ వాల్యూ ద్వారా రూ.51గా ఉంటుంది. ఈ వోచర్లను మైజియో యాప్ నుంచి యాక్టివేట్ చేయవచ్చు. ఈ వోచర్‌లను ఉపయోగించడం ద్వారా మీరు సంవత్సరం మొత్తం జియో 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉండవచ్చు. అయితే ఈ రూ. 51 వోచర్‌ వాడాలంటే మీరు ఉపయోగించే ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటాను అందించే ప్లాన్ అయి ఉండాలి.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


వోచర్‌ ట్రాన్స్‌ఫర్ ఎలా జరుగుతుంది?
రూ.601 వోచర్‌ను మైజియో అకౌంట్ల మధ్య ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే రూ.51 వోచర్‌లను విడిగా ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది సాధ్యం కాదు. చేస్తే పూర్తి ప్లాన్‌ను మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం. యూజర్లు రూ.601 జియో ట్రూ 5జీ అప్‌గ్రేడ్ గిఫ్ట్ వోచర్‌ను వారి నంబర్‌లో కాకుండా స్నేహితులు, బంధువులకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. కానీ దానికి ముందు వారు దానిని రిడీమ్ చేయకూడదు. పొరపాటున రిడీమ్ చేసినా అది ట్రాన్స్‌ఫర్ అవ్వదు.


5జీ అప్‌గ్రేడ్ వల్ల ప్రయోజనాలివే...
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ వోచర్ తక్కువ ధరలో 5జీని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వినియోగదారులకు ఉత్తమమైనది. దీన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఎక్కువ ఖర్చు లేకుండా వారి డేటా వేగం, కనెక్టివిటీని అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.


ఈ వోచర్‌ను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
1. ముందుగా మీ మైజియో అకౌంట్లో లాగిన్ అవ్వాలి.
2. యాప్ మెనూ నుంచి "మై వోచర్" విభాగానికి వెళ్లండి.
3. అందుబాటులో ఉన్న వోచర్ల జాబితా నుండి రూ.601 వోచర్‌ని ఎంచుకోండి.
4. వోచర్‌ను రీడీమ్ చేయడానికి 'రిడీమ్' బటన్‌ను నొక్కండి.
5. వోచర్ రిడీమ్ ప్రాసెస్‌ను అప్రూవ్ చేయండి.
6. వోచర్‌ను రీడీమ్ చేసిన తర్వాత జియో 5జీ నెట్‌వర్క్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం ప్రారంభించండి.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!