Jio Happy New Year Offer 2024: జియో మనదేశంలో ప్రీపెయిడ్ యూజర్ల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ను ప్రకటించింది. ఈ న్యూ ఇయర్ ఆఫర్ కంపెనీ వార్షిక రూ.2,999 ఆఫర్‌పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు కాగా, ఇప్పుడు 24 రోజులు అదనంగా అందించనున్నారు. అంటే మొత్తం వ్యాలిడిటీ 389 రోజులకు చేరిందన్న మాట. ఈ ప్లాన్ లాభాల్లో పెద్దగా మార్పులేమీ లేవు. అయితే వ్యాలిడిటీ పెరిగింది కాబట్టి రోజుకు వినియోగదారునికి పడే మొత్తం తగ్గనుంది.


కంపెనీ వెబ్ సైట్లో దీని గురించి వివరించారు. జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్‌లో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకున్నాక ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగానే చూపిస్తుంది. కానీ 24 రోజుల వ్యాలిడిటీ వోచర్ ప్రత్యేకంగా అందించనున్నారు. 365 రోజులు ముగిసిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవచ్చు.


మిగతా లాభాల్లో ఎటువంటి మార్పులూ లేవు. ఈ అదనపు వ్యాలిడిటీ కారణంగా వినియోగదారుడికి రోజుకు పడే ఖర్చు రూ.8.21 నుంచి రూ.7.7కు పడిపోనుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2.5 జీబీ 4జీ డేటా కూడా అందించనున్నారు.


అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. దీంతోపాటు 5జీ సౌకర్యం ఉన్న చోట అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభించనుంది.


జియో సినిమా ప్రీమియం కాదు...
ఈ ప్లాన్ ద్వారా లభించేది జియో సినిమా ప్లాన్ మాత్రమేనని వినియోగదారులు గుర్తించాలి. జియో సినిమా ప్రీమియం కావాలంటే రూ.1,499తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 14 వేర్వేరు ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్ సింగిల్ ప్లాన్ ద్వారా లభించనుంది.


రూ.909 కూడా అందుబాటులో...
రిలయన్స్ జియో ఇటీవలే సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటాను జియో అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. జీ5, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ కూడా అందించనున్నారు. జియో సినిమా, జియో యాప్స్, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 168 జీబీ డేటా లభించనుంది. రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తంగా 168 జీబీ డేటా అన్న మాట. 2 జీబీ డేటా కోటా పూర్తయితే నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోనుంది. ఒకవేళ హైస్పీడ్ డేటా ప్లాన్స్ కావాలనుకుంటే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!