Itel New Phone: ఐటెల్ సూపర్ గురు 4జీ ఫీచర్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఆరు గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ ఫోన్ డెలివర్ చేయనుందని కంపెనీ ప్రకటించింది. రెండు అంగుళాల డిస్‌ప్లేను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ వెనకవైపు డిజిటల్ కెమెరాను చూడవచ్చు. ఐటెల్ సూపర్ గురు ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్‌ను చూడవచ్చు. డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 4జీ కనెక్టివిటీని కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేయనుంది.


ఐటెల్ సూపర్ గురు 4జీ ధర (Itel Super Guru 4G Price in India)
ఈ ఫీచర్ ఫోన్ ధరను మనదేశంలో రూ.1,799గా నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్ సేల్‌కు రానుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన సేట్ ఇంకా ప్రారంభం మాత్రం కాలేదు. ఐటెల్ అధికారిక వెబ్‌సైట్, కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఐటెల్ సూపర్ గురు 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Itel Super Guru 4G Specifications)
ఇందులో 2 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. ఇన్‌బిల్ట్ క్లౌడ్ బేస్డ్ సపోర్ట్ ద్వారా యూట్యూబ్‌ను కూడా ఇందులో స్ట్రీమ్ చేయవచ్చు. ఫుల్ లెంత్ వీడియోలతో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా చూడవచ్చు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ సహా 13 భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. బీబీసీ న్యూస్‌ను కూడా ముందుగా సెట్ చేసిన లాంగ్వేజ్‌లో యాక్సెస్ చేయవచ్చు.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఐటెల్ సూపర్ గురు 4జీ వెనకవైపు వీజీఏ కెమెరా ఉంది. దీంతో అద్భుతమైన ఫొటోలు వస్తాయని చెప్పలేం కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి సరిపోతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్స్‌కు ఇది పర్‌ఫెక్ట్ ఫోన్. ఇందులో ఉన్న 123పే ఫీచర్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.


ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 1000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా ఆరు రోజుల బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ అంటోంది. డ్యూయల్ 4జీ కనెక్టివిటీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. టెట్రిస్, 2048, సుడొకు వంటి గేమ్స్‌ను ఈ ఫోన్‌లో ఆడవచ్చు.





Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది