Is ChatGPT Free or Paid?: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ మేనియా నడుస్తుంది. ఈ ఓపెన్ ఏఐ  చాట్‌బాట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో ఉంది. రాబోయే కాలంలో టెక్ దిగ్గజం గూగుల్‌తో చాట్‌జీపీటీ పోటీ పడుతుందని తెలుస్తోంది. నిజానికి ఈ ఓపెన్ ఏఐ చాట్‌బాట్ మెషిన్ లెర్నింగ్‌పై ఆధారపడింది.


ఇంటర్నెట్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న మొత్తం డేటా దీనికి అందించారు. ప్రస్తుతం ఈ చాట్‌బాట్ లైమ్‌లైట్‌లో ఉన్నందున, కొంతమంది చాట్‌జీపీటీ పేరుతో నకిలీ యాప్‌లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు అందరిలో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే చాట్‌జీపీటీ అనేది ఉచితమా? లేకపోతే దానికి నగదు చెల్లించాలా?


ఎవరైనా ChatGPTని ఉపయోగించవచ్చా?
చాట్‌జీపీటీని ఎవరైనా ఉచితంగా ఉపయోగించవచ్చు. అవును, ఇది పూర్తిగా ఉచితం. దీని కోసం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి చాలా యాప్ స్టోర్లలో చాట్ జీపీటీ పేరుతో నకిలీ యాప్‌ను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 'చాట్ జీపీటీ' అనేది ఉచిత ఏఐ అని గుర్తుంచుకోవాలి. మీరు వెబ్ బ్రౌజర్‌లో దీన్ని సులభంగా, ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.


మొబైల్‌లో ఉపయోగించడం ఎలా?
మీ మొబైల్ ఫోన్‌లో ఈ చాట్‌బాట్‌ని ఉపయోగించడానికి, ముందుగా మీరు OpenAI అధికారిక వెబ్‌సైట్ (https://openai.com/blog/chatgpt/) సందర్శించాలి. వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత, మీకు ట్రై చాట్ GPT అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి. మీరు మొదటిసారిగా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నట్లయితే, మీరు సైన్-అప్ చేయాలి.


దీని కోసం, మీరు మీ WhatsApp నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఉపయోగించవచ్చు. మీరు సైన్-అప్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు చాట్‌బాట్‌ను ఉపయోగించగలరు. లాగిన్ అయిన తర్వాత మీరు మీ ప్రశ్నను టైప్ చేయవలసిన సెర్చ్ బార్‌ను చూస్తారు. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే సమాధానం మీ ముందు కనిపిస్తుంది.


ఓపెన్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధన చేస్తున్న సంస్థ. దీనిని 2015లో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ ప్రారంభించారు. తరువాత ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్ట్ నుండి విడిపోయారు. ప్రస్తుతం Open AI సంస్థకి Microsoft సపోర్ట్ ఉంది.


ఈ ఓపెన్ ఏఐ చాట్ బాట్ త్వరలో గూగుల్‌కే ఎసరు పెట్టనుందని తెలుస్తోంది. ఎందుకంటే గూగుల్‌లో దేన్నయినా సెర్చ్ చేస్తే మనకు వందల ఆప్షన్లు కనిపిస్తాయి. కానీ ఇందులో మాత్రం సూటిగా, సుత్తి లేకుండా మనం అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.


Disclaimer: “వివిధ ప్రశ్నలకు ChatGPT (ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన ఏఐ వండర్‌బోట్) అందించిన స్పందనలను కథనాల్లో అందించాం. ఏబీపీ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ (‘ABP’) అటువంటి స్పందనల్లో దేనికీ ఎటువంటి బాధ్యత వహించదు. వినియోగదారులు విచక్షణతో నడుచుకోవాలని సూచన.”