iQoo 12 Price in India: ఐకూ 12 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం పవర్‌ఫుల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇందులో పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫ్లాష్‌ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


ఐకూ 12 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999 కాగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.57,999గా నిర్ణయించారు. ప్రమోషనల్ ఆఫర్ కింద దీన్ని రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే దీనికి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి ప్రయారిటీ పాస్ కొన్నవారికి అందుబాటులో ఉండనుంది. సేల్ డిసెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


ఐకూ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై కొత్త ఐకూ 12 పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ 1200 హెర్ట్జ్‌గా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్‌గా ఉంది.


క్వాల్‌కాం ఇటీవలే లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. మనదేశంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. దీంతోపాటు ఐకూ స్వయంగా రూపొందించిన క్యూ1 చిప్ కూడా అందించారు. దీని ద్వారా గేమింగ్ మరింత మెరుగవనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ కూడా ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూని అందించే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌ను, 100x డిజిటల్ జూమ్‌ను అందించనుంది.


ఐకూ తెలుపుతున్న దాని ప్రకారం... ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా, టెలిఫొటో కెమెరా ఏఐ అసిస్టెడ్ ఆస్ట్రోఫొటోగ్రఫీని సపోర్ట్ చేయనుంది. ఇందులో ‘సూపర్ మూన్’ మోడ్ కూడా ఉందని కంపెనీ అంటోంది. అంటే ఆకాశంలోని నక్షత్రాలను, చందమామను క్లియర్‌గా చూపించవచ్చన్న మాట. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


5జీ, 4జీ, ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, యూఎస్‌బీ 2.0 టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్, యాంబియంట్ కలర్ సెన్సార్లు కూడా ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫ్లాష్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 203.9 గ్రాములుగా ఉందని కంపెనీ తెలిపింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!