అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 14ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. రూ. 40 వేలలోపు ధరకే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ గతేడాది మార్కెట్లో లాంచ్ అయింది. ఐఫోన్ 13కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. బ్యాంక్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్, అమెజాన్ పే రివార్డ్స్ అన్నీ కలుపుకుంటే ఐఫోన్ 14 ఈ ధరకు లభించనుంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డీల్‌లో భాగంగా రూ.39,293కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ.40 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. అయితే దీనికి మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేయాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే ఎప్పుడు ముగుస్తుందో మాత్రం తెలియరాలేదు.
సేల్‌లో దీని ధర రూ.66,999గా ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.375 డిస్కౌంట్ లభించనుంది. రూ.2,331 అమెజాన్ పే క్రెడిట్ క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాతే రూ.5,000 వరకు అమెజాన్ పే రివార్డ్స్ కూడా లభించనున్నాయి.
మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ. 20,000 అదనపు తగ్గింపు అందించనున్నారు. ఈ ఆఫర్స్ అన్నీ కలిపితే ఈ రూ.40 వేల లోపే కొనుగోలు చేశారు. దీంతో పాటు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,481 క్యాష్ బ్యాక్ అందించనున్నారు.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.
ఐఫోన్ 14తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.