Apple iPhone 11 ఇప్పటి వరకు అత్యంత జనాదరణ పొందిన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో దీనిపై భారీ తగ్గింపును అందించారు. యాపిల్ ఐఫోన్ 11 2020లో ప్రపంచవ్యాప్తంగా 'అత్యధికంగా అమ్ముడయిన' స్మార్ట్‌ఫోన్. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ఆగిపోయింది. యాపిల్ ఐఫోన్ 11లో మంచి కెమెరాలు అందించారు. రౌండ్ అంచులను కలిగి ఉన్న చివరి ఫ్లాగ్‌షిప్ యాపిల్ ఐఫోన్ మోడల్ ఇది.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో దీని ధర రూ.37,999గా ఉంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతో పాటు ఎక్స్‌చేంజ్‌పై అదనంగా రూ.20,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు, దీనితో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 16,999కి తగ్గనుంది.
ఐఫోన్ 11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఓఎస్ 14.2 ఆపరేటింగ్ సిస్టంపై ఐఫోన్ 11 పనిచేయనుంది. దీన్ని లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ముందువైపు, వెనకవైపు అత్యంత కఠినమైన గ్లాస్‌ను అందించినట్లు యాపిల్ ప్రకటించింది.
ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఇందులో కూడా వెనకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. అయితే ఇందులో మెరుగైన విజువల్ ప్రాసెసింగ్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 60 ఎఫ్‌పీఎస్, స్మార్ట్ హెచ్‌డీఆర్4 వద్ద 4కే వీడియోను రికార్డ్ చేసే అవకాశం ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ వోల్టే, వైఫై 5, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, లైటెనింగ్ పోర్టు ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు యాపిల్ ఇందులో అందించింది.