ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఘోరం జరిగింది. కరెంట్ షాక్ తగిలి ఓ టెక్నీషియన్ చనిపోయాడు. తమిళ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కరెంట్ షాక్ వల్లే చనిపోయాడా?


చెన్నైలోని పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో రెహమాన్‌  ఓ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్టూడియోలో లైట్లు సరి చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు లైట్ మెన్ కరెంట్ షాక్ తో చనిపోయాడు. లైట్లు మార్చుతుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడిపోయాడు. కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తను అక్కడిక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన చాలా తమిళ వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, అధికారికంగా ఈ ప్రమాదానికి సంబంధించి రెహమాన్ తరఫు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పంచతాన్ స్టూడియో నుంచి రెహమాన్‌ లైవ్‌ షో లు, కన్‌ సర్ట్‌ లు చేస్తుంటారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు.


వరుస సినిమాలతో రెహమాన్ బిజీ


గత కొంత కాలంగా రెహమాన్ వరుసగా సినిమాలు చేస్తున్నారు.  గతేడాది వచ్చిన విక్రమ్‌ ‘కోబ్రా’,’ లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలకు సంగీతం అందించారు.  ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’తో పాటు తమిళంలో పలు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.  






Read Also: వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అదిరిందిగా!