మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ‘వీటీ 12’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది వారాల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పైలెట్ గా కనిపించనున్నట్లు క్లూ ఇచ్చారు. తాజాగా వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను మోషన్ పోస్టర్ ద్వారా రిలీవ్ చేశారు. వరణ్ తేజ్ కొత్త చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు.


ఆకట్టుకుంటున్న ‘గాండీవధారి అర్జున’ మోషన్ పోస్టర్


తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఒక చేతితో విలన్ ను నేలకేసి కొట్టినట్లుగా కనిపిస్తున్నాడు. మరో చేతిలో గన్ పట్టుకుని అదుర్స్ అనిపించేలా ఉన్నాడు. ఆయన లుక్ చూస్తుంటేనే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా ఉన్నాయి. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మోషన్ పోస్టర్ కు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.  






లండన్ లో కొనసాగుతున్న షూటింగ్


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లండన్ లో కొనసాగుతోంది. లండన్ షెడ్యూల్ సైతం దాదాపు 80 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరో 20 శాతం ఇతర యూరప్ దేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో వీవీఎస్‌ఎన్ ప్రసాద్‌, బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు స్పై కథాంశంతో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘గాండీవధారి అర్జున’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  


ఈ మూవీపై ఆశలు పెట్టుకున్న వరుణ్ తేజ్


ఇక ‘చందమామ కథలు’ సినిమాతో జాతీయ  అవార్డును అందుకున్న ప్రవీణ్ సత్తారు.. ‘గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చాటుకున్నారు. నాగార్జునతో  ‘ద ఘోస్ట్’ సినిమా చేసి మెప్పించారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. తోనూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పెద్ద విజయాలు సాధించకపోయినా.. ఫిల్మ్ మేకర్‌గా ప్రవీణ్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘గని’ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన వరుణ్ తేజ్ కు ఈ సినిమా మంచి హిట్ అందివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.   


Read Also: డబ్బింగ్ చెప్తున్న అల్లు అర్జున్ ముద్దుల కూతురు, ఏ సినిమా కోసమో తెలుసా?