Instagram: ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీ కోసం మెటా యాక్టివిటీ ఆఫ్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా ఇతర వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సేకరించే ప్రక్రియను బ్లాక్ చేయవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు, సమాచారాన్ని అందించడానికి కంపెనీలు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇందులో కుకీల సహాయంతో వినియోగదారుల సెర్చ్ హిస్టరీ ట్రాక్ అవుతుంది. వారికి ఏం ఇష్టమో కూడ తెలుస్తుంది.


ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులకు తెలియకుండా డేటా తీసుకుంటున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇన్‌స్టాగ్రామ్ నుంచి వినియోగదారుల యొక్క ఏదైనా సమాచారం తీసుకోవాలంటే, మొదట యూజర్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వినియోగదారులు కోరుకుంటే వారు డేటాను సేకరించే యాప్‌లు, వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేయవచ్చు.


అసలు విషయం ఇదీ...
వాస్తవానికి 2021లో మెటా కొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టింది. దాని కోసం వినియోగదారుల నుండి పర్మిషన్ కూడా కోరింది. కొత్త ప్రైవసీ విధానం ప్రకారం వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తమ భాగస్వామి కంపెనీలతో పంచుకోవచ్చు. ఈ డేటా వినియోగదారులకు పర్సనలైజ్డ్ యాడ్స్‌ను చూపడానికి ఉపయోగించబడుతుంది.


అయితే దీని తర్వాత మెటా కూడా చాలా దేశాల్లో చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు దీని కోసం కంపెనీ వినియోగదారులకు నియంత్రణను ఇచ్చింది. అంటే వినియోగదారులు తమ డేటాను మెటా యాక్సెస్ చేయకూడదు అనుకుంటే వారు డేటాను తొలగించవచ్చు. అలాగే వారి ప్రత్యేక కార్యకలాపాలను కూడా డిస్‌కనెక్ట్ చేయవచ్చు.


మరోవైపు ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీకి అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో నోటిఫికేషన్ల కోసం పిల్ ఆకారంలో ఉన్న సరికొత్త మ్యాజిక్ రింగ్ ఫీచర్ అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీని వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.6,299గా ఉంది. యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందించనున్నారు. అంటే కేవలం రూ. 5,669కే ఈ స్మార్ట్ ఫోన్ కొనేయవచ్చన్న మాట. క్రిస్టల్ క్లీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ ఆప్షన్లలో ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!