Infinix Smart 8 HD Price in India: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో నోటిఫికేషన్ల కోసం పిల్ ఆకారంలో ఉన్న మ్యాజిక్ రింగ్ ఫీచర్ అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.6,299గా నిర్ణయించారు. యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంటే కేవలం రూ. 5,669కే దీన్ని కొనేయచ్చన్న మాట. క్రిస్టల్ క్లీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్జ్‌గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ కూడా స్క్రీన్‌లో అందించారు. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. మ్యాజిక్ రింగ్ అనే సాఫ్ట్ వేర్ ఫీచర్‌ను ఇందులో అందించారు. ఛార్జింగ్ యానిమేషన్లు, బ్యాక్‌గ్రౌండ్ కాల్స్, లో బ్యాటరీ రిమైండర్స్ వంటి నోటిఫికేషన్లు ఇందులో ఉండనున్నాయి.
ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ రన్ కానుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ర్యామ్‌ను కూడా 6 జీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 39 గంటల కాలింగ్ టైమ్, 50 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 36 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను ఈ ఫోన్ అందించనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!