Satellite Internet Services : ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రావడం రావడంతోనే ఇండస్ట్రీని షేక్ చేయాలన్న సంకల్పంతో వస్తున్నారు. సుమారు రూ. 840 కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా ప్లాన్‌లతో దండయాత్రకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారతదేశం తన బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక విధ్వంసకరమైన ఆరంభాన్ని ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రారంభంలోనే గణనీయమైన సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది, మధ్యస్థం నుంచి దీర్ఘకాలికంగా 10 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల వరకు తమవైపు తిప్పుకునే అంచనా వేస్తుంది.
డీప్-పాకెటెడ్ ప్లేయర్‌లకు అధిక రుసుములు అడ్డంకి కాదుటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టణ ప్రాంతాలకు నెలవారీ వినియోగదారు ఛార్జీని రూ. 500గా సిఫార్సు చేసినప్పటికీ, ఇది శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను సాంప్రదాయ నెట్‌వర్క్‌ల కంటే ఖరీదైనదిగా మారుస్తుంది. నిపుణులు స్టార్‌లింక్ వంటి కంపెనీలు పట్ల ఆసక్తి ఉంటుందని అంటున్నారు. ఈ ఆపరేటర్లు వాల్యూమ్-ఆధారిత మోడళ్లపై దృష్టి పెడతారని భావిస్తున్నారు.
"స్పెక్ట్రమ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నప్పటికీ, శాట్‌కామ్ కంపెనీలు భారతదేశంలో తక్కువ ధరకే - బహుశా $10 కంటే తక్కువ - ప్రారంభించాలని భావిస్తున్నారు, తద్వారా పెద్ద కస్టమర్ బేస్‌పై మంచి టేకప్ సాధించడానికి, వారి ఖర్చులు రాబెట్టుకోవడానికి," అని కన్సల్టింగ్ సంస్థ అనాలిసిస్ మాసన్ భాగస్వామి అశ్విందర్ సేథి అన్నారు.
ట్రాయ్ ప్రతిపాదించిన రెగ్యులర్ ఫ్రేమ్ వర్క్‌లో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR)పై 4 శాతం లెవీ, స్పెక్ట్రమ్ వినియోగం కోసం MHzకి కనీసం వార్షికంగా రూ. 3,500 చెల్లింపులు చేయాలి. అదనంగా, వాణిజ్య ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి ఆపరేటర్లు 8 శాతం లైసెన్స్ రుసుము చెల్లించాలి. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
వేగవంతమైన వృద్ధిని అరికట్టవచ్చుపరిచయ ధర పాయింట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత శాటిలైట్ ఇంటర్నెట్ పరిమిత బ్యాండ్‌విడ్త్ వృద్ధికి ఆటంకం కలిగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్టార్‌లింక్, దాదాపు 7,000 ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోందని IIFL రీసెర్చ్ పేర్కొంది. FY30 నాటికి 18,000 ఉపగ్రహాల సముదాయం విస్తరించినప్పటికీ, కవరేజ్ పరిమితుల కారణంగా భారతీయ వినియోగదారులకు సేవలందించే సామర్థ్యం 1.5 మిలియన్లకు మించకపోవచ్చు.
“సబ్‌స్క్రైబర్ ర్యాంప్-అప్ పరంగా సామర్థ్య పరిమితులు సవాలుగా మారవచ్చు. సబ్‌స్క్రైబర్ నుఆకట్టుకోవాలని ధరల తగ్గించవచ్చు” అని IIFL రీసెర్చ్ పేర్కొంది. నెట్‌వర్క్ సామర్థ్యం దాని పరిమితిని చేరుకున్నప్పుడు స్టార్‌లింక్ US, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కొత్త సబ్‌స్క్రిప్షన్‌లను నిలిపివేసిందని కూడా సంస్థ చెబుతోంది.
అంతేకాకుండా, స్టార్‌లింక్ ఉపగ్రహ సామర్థ్యంలో 0.7 శాతం నుంచి 0.8 శాతం మాత్రమే ఏ సమయంలోనైనా భారతదేశాన్ని కవర్ చేయడానికి అందుబాటులో ఉంటుందని IIFL అంచనాలు ఉన్నాయి. ఇది ప్రపంచ భూభాగంలో భారతదేశం భౌగోళిక వాటాకు దాదాపు సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ధరలు చూస్తే దేశంలో ప్రామాణిక గృహ ఇంటర్నెట్ సేవల కంటే ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ చాలా ఖరీదైనది. JM ఫైనాన్షియల్ ప్రకారం, ఉపగ్రహ ఇంటర్నెట్ ఖర్చులు సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌ల కంటే ఏడు నుంచి 18 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక సమస్యగా ఉండవచ్చని అంచనా.
తుది నియంత్రణ అనుమతి కోసం ఎదురు చూపులుస్టార్‌లింక్ టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి ప్రాథమిక అనుమతి పొందినప్పటికీ, కంపెనీ ఇంకా IN-SPACe - ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి తుది అనుమతి కోసం వేచి ఉంది. 2021, 2022లో వరుసగా లైసెన్స్‌లను పొందిన Eutelsat OneWeb, Jio Satellite Communications వంటి పోటీదారులు, IN-SPACe గ్రీన్ సిగ్నల్ పొందే ముందు దాదాపు రెండు సంవత్సరాలు అనుమతి కోసం ఎదురు చూశాయి.
జూన్ 2020లో ఏర్పడిన స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద ఉన్న IN-SPACe, భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ప్లేయర్ల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి సింగిల్-విండో ఏజెన్సీగా పనిచేస్తుంది. దీని బాధ్యతల్లో నియంత్రణ పర్యవేక్షణ, ప్రభుత్వేతర అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల వినియోగాన్ని సమన్వయం చేయడం వంటివి ఉన్నాయి.