Adivi Sesh's Dacoit Movie Glimpse Update: అడివి శేష్ హీరోగా మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్'. టీజర్ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా.. ఈ మూవీ నుంచి టీం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. టైటిల్ గ్లింప్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. 

గ్లింప్స్ ఎప్పుడంటే?

ఈ మూవీలో అడివిశేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ మూవీపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా.. ఈ నెల 26న ఉదయం 11:07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడివి శేష్ వెల్లడించారు. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read: టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్‌కు థాంక్స్... ఇండస్ట్రీకి స్పెషల్ పాలసీ... డైరెక్ట్‌గా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

ఆసక్తికరంగా గ్లింప్స్ పోస్టర్ 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ట్రైన్, కార్‌కు ఫైర్ యాక్సిడెంట్ జరగ్గా.. దూరంగా వెనుక నుంచి అడివి శేష్ చూస్తూ ఉండడం హైప్ క్రియేట్ చేసింది. మాస్ ఇంటెన్స్ లుక్‌లో ఆయన అదరగొట్టారు. అప్పట్లో రిలీజ్ అయిన టీజర్ సైతం ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. రోడ్డు మీద శవాల మధ్య ఇద్దరు లవర్స్ ఎంతోకాలం తర్వాత విడిపోయినట్లుగా చూపిస్తారు. వారు ఒకరినొకరు గన్స్‌తో బద్ద శత్రువుల్లా ఎయిమ్ చేసుకోవడం క్యూరియాసిటీని పెంచింది. లవర్స్ ఎందుకిలా ఎనిమీస్‌లా మారారో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

భారీ ధరకు ఆడియో రైట్స్

ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.8 కోట్లకు ప్రముఖ సంస్థ సోనీ.. ఆడియో హక్కులను సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది రికార్డు.

మరోవైపు.. అడివి శేష్ 'జీ2' సినిమాతోనూ బిజీగా ఉన్నారు. 'గూఢచారి' సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతుండగా.. కొన్ని యాక్షన్ సీన్స్ విదేశాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.