WhatsApp Chat Lock: వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత టైట్ చేయడానికి మెటా ఇటీవల ఛాట్ లాక్ ఫీచర్‌ను యాడ్ చేసింది. దాని సహాయంతో మీకు కావాల్సిన ఛాట్లను లాక్ చేయవచ్చు. ఛాట్‌ను లాక్ చేయడానికి, మీరు యూజర్ ప్రొఫైల్‌కు వెళ్లి అక్కడ కనిపించే ఛాట్ లాక్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ ఛాట్ పూర్తిగా మరో ఫోల్డర్‌కి వెళ్లిపోతుంది. మీరు కూడా ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, ఖచ్చితంగా ఈ రెండు విషయాలు తెలుసుకోండి.


వెబ్ వెర్షన్‌లో పని చేయని ఛాట్ లాక్


1. మీరు వాట్సాప్‌లో ఛాట్ని లాక్ చేసినట్లయితే, అది వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో లాక్ అవ్వదు. అంటే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఆ ఛాట్‌ను ఎవరైనా చూడగలరు. మీరు వాట్సాప్ వెబ్‌లో మీ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఉంచినట్లయితే, అవతలి వ్యక్తి మీరు లాక్ చేసిన ఛాట్‌లను చదవగలరు.


2. మీరు ఛాట్ లాక్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి, ఆ విండోను క్లోజ్ చేయడం మర్చిపోయినా ఎవరైనా మీరు లాక్ చేసిన ఛాట్‌లను చదవగలరు. మీరు వాట్సాప్‌ను ఆఫ్ చేసి ఆపై ఫోన్‌ను ఎక్కడైనా వదిలేస్తే సరిపోతుంది. ఇది మీ ప్రైవసీకి భంగం కలిగించదు. వాస్తవానికి ఇది రాబోయే కాలంలో కంపెనీ పరిష్కరించాల్సిన బగ్ కావచ్చు.


పరిష్కారం ఏంటి?
మెసేజింగ్ యాప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచర్‌ని ఆన్ చేయడం ద్వారా మీరు దీన్ని పరిష్కరించవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే మీ ఛాట్ లాక్ ఫీచర్ పని చేయకపోయినా, ఫింగర్‌ప్రింట్ లాక్‌తో మీ మెసేజ్‌లను ఎవరూ చదవలేరు. ఎందుకంటే యాప్‌కి సెకండరీ సెక్యూరిటీ ఫీచర్ కూడా యాడ్ అవుతుంది. యాప్‌ను లాక్ చేయడానికి మీరు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో ప్రైవసీ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌ను ఆన్ చేయాలి.


ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.


వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. కాగా విండోస్ యూజర్ల కోసం కంపెనీ యాప్‌లో కొత్త ఆప్షన్‌ను ఇచ్చింది. దీని సహాయంతో వాట్సాప్ అధికారులను సంప్రదించడం మరింత సులభం అయింది.


వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను అబ్జర్వ్ చేసే వెబ్‌సైట్ Wabetainfo ప్రకారం కంపెనీ Windows వినియోగదారులకు యాప్‌లో ఛాట్ సపోర్ట్‌ను అందించడం ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు మొబైల్‌లో హెల్ప్ సపోర్ట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు విండోస్ యూజర్‌లు కూడా యాప్‌లో కూడా అదే విధంగా పొందుతారు.


వినియోగదారులు ఛాట్ లేదా మెయిల్‌లో వారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. విండోస్ వినియోగదారులకు కూడా ఈ అప్‌డేట్‌ను పొందడం ప్రారంభించారు. ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటంటే వినియోగదారులు వారి సమస్యలకు యాప్‌లోనే పరిష్కారం పొందుతారు. వారు యాప్‌ను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదు.





Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!