సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆన్‌లైన్‌లో చూసేవారికి ‘iBomma’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బుధవారం వారు సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో వినియోగదారులు కాసేపు ఆందోళనకు గురయ్యారు.
అయితే వినియోగదారులు ఈ-మెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేయడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెబ్‌సైట్లో నోట్ ద్వారా తెలిపింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అన్ని ఓటీటీల్లో ఉన్న సినిమాలను ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు.
ఈ వెబ్‌సైట్‌ను ఎందుకు నిలిపివేయాలనుకున్నారో కారణాలు తెలియరాలేదు. అయితే దీనిపై తాము ఇంతవరకు ఎటువంటి ఆదాయం సంపాదించలేదని, సర్వర్ల కోసం తమ చేతిలోని డబ్బులే ఖర్చు పెట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!