Reliance Jio: టెలికాం మార్కెట్‌లోకి రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుండి, కాలర్ ట్యూన్‌ను ఉచితంగా సెట్ చేసే ట్రెండ్ ప్రారంభం అయింది. మీకు నచ్చిన కాలర్ ట్యూన్‌ని సులభంగా ఎలా సెట్ చేసుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం. కాలర్ ట్యూన్ సెట్ చేయడానికి వినియోగదారులు మై జియో యాప్, ఎస్ఎంఎంస్, మ్యూజిక్ యాప్ జియో సావన్‌లను ఉపయోగించవచ్చు. ఏ పద్ధతిలో ఎలా సెట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


జియో సావన్ యాప్ నుంచి ఎలా?
1. ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి జియో సావన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
2. దీని తర్వాత యాప్‌లో లాగిన్ అవ్వండి.
3. ఆపై మీరు హోమ్ పేజీలో పైన కుడి భాగంలో జియోట్యూన్స్ ఆప్షన్‌ను చూస్తారు.
4. దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అందులో మీకు ఇష్టమైన పాట కోసం వెతకండి.
5. ఇప్పుడు ఆ పాటపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు జియో ట్యూన్, రింగ్ టోన్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
6. మీరు జియో ట్యూన్ ఆప్షన్‌పై క్లిక్ చేసినప్పుడు, సెట్ ఆప్షన్ కింద కనిపిస్తుంది.
7. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే జియో ట్యూన్ ఇన్‌స్టాల్ అవుతుంది.
8. మీ జియో ట్యూన్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది.


మై జియో యాప్ నుంచి ఇలా?
1. మీరు మైజియో యాప్ నుంచి జియోట్యూన్ సెటప్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
2. మైజియో యాప్‌ని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
3. దీని తర్వాత మీ జియో నంబర్‌తో లాగిన్ చేయండి.
4. అనంతరం హోమ్ పేజీ దిగువ మధ్యలో జియో ట్యూన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీకు ఇష్టమైన పాటను ఇక్కడ సెర్చ్ చేయండి. అనంతరం మీరు కాలర్ ట్యూన్‌ని సెట్ చేయాలనుకుంటున్న పాటపై క్లిక్ చేయండి.
6. ఆ పాట ప్రివ్యూను వినడానికి ప్లే బటన్‌పై నొక్కండి.
7. మీకు నచ్చితే ‘Set as JioTune’పై క్లిక్ చేయండి.
8. మీరు జియో ట్యూన్ యాక్టివేషన్ గురించిన సమాచారాన్ని సందేశం ద్వారా లేదా స్క్రీన్‌పైనే పొందుతారు. 


ఎస్ఎంఎస్ ద్వారా జియో ట్యూన్స్‌ని సెటప్ చేయడం ఎలా?
1. మీ మొబైల్‌లో మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి JT అని టైప్ చేసి 56789కి మెసేజ్ పంపండి.
2. దీని తర్వాత మీరు జియో ట్యూన్‌ను ఎలా సెట్ చేయాలి అనే వివరాలతో కూడిన మెసేజ్ అందుతుంది.
3. అనంతరం మీరు సినిమా పేరును రిప్లైగా ఇవ్వాలి. ఒకవేళ అది ఆల్బమ్ అయితే 'ALBUM' అని స్పేస్ ఇచ్చి ఆల్బమ్ పేరును టైప్ చేసి మెసేజ్ పంపండి. మీరు సింగర్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటే 'సింగర్' అని స్పేస్ ఇచ్చి మెసేజ్ పంపండి.
4. దీని తర్వాత మీకు తర్వాతి మెసేజ్‌లో సాంగ్స్ లిస్ట్‌ను పొందుతారు. లిస్ట్ నుంచి మీకు నచ్చిన పాటను ఎంచుకోండి. మీరు కాలర్ ట్యూన్‌ని ఎంచుకున్న తర్వాత అదే మెసేజ్‌కు 'Y' అని రిప్లై పంపండి. ఆ తర్వాత అరగంటలో జియోట్యూన్ యాక్టివేట్ అవుతుంది.


స్టార్ బటన్‌ని ఉపయోగించి జియో ట్యూన్స్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
1. మీకు కావలసిన జియో ట్యూన్ పెట్టుకున్న నంబర్‌కు కాల్ చేయండి.
2. కాల్‌కు సమాధానం ఇచ్చే ముందు స్టార్ బటన్‌ను క్లిక్ చేయండి.
3. దీని తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
4. ఆ తర్వాత మెసేజ్‌కి రిప్లైగా Y అని టైప్ చేయండి. కొంత సమయం తర్వాత మీ జియో ట్యూన్ యాక్టివ్ అవుతుంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది