Sankranti WhatsApp Stickers: తెలుగువారికి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా సంక్రాంతికి సన్నాహాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మీరు కూడా సంక్రాంతి సందర్భంగా మీ స్నేహితులకి, బంధువులకి లేదా ఎవరికైనా సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లు లేదా జిఫ్‌లు పంపాలనుకున్నా, వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసి, ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.


సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?


స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు సెర్చ్ బాక్స్‌లో సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్స్ అని సెర్చ్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు మీకు నచ్చిన వాట్సాప్ స్టిక్కర్ల ప్యాక్ ఎంచుకుని, దానిపై క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 4: ఇది డౌన్‌లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా మీ స్నేహితులు లేదా బంధువులకు పంపాలనుకుంటున్న సంక్రాంతి స్టిక్కర్‌లను ఎంచుకోండి.
స్టెప్ 6: ఆ స్టిక్కర్ల ప్యాక్ ముందు + లేదా యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.


సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్లను ఎలా పంపాలి?


స్టెప్ 1: ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు మీరు హ్యాపీ సంక్రాంతి వాట్సాప్ స్టిక్కర్‌లను పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ ఛాట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు టెక్స్ట్ బాక్స్‌లో కనిపించే ఎమోజి సింబల్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇప్పుడు దిగువన జిఫ్ పక్కన స్టిక్కర్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. (జిఫ్‌ని పంపడానికి, మీరు ఇక్కడ నుండి జిఫ్ ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.)
స్టెప్ 5: ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన అదే స్టిక్కర్ల ప్యాక్‌ని ఇక్కడ చూస్తారు.
స్టెప్ 6: ఇప్పుడు మీరు పంపాలనుకుంటున్న స్టిక్కర్‌పై క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్‌గా మీ ఫ్రెండ్ లేదా గ్రూప్‌నకు వెళుతుంది.


ఐఫోన్ వినియోగదారులు సంక్రాంతి స్టిక్కర్లను ఎలా పంపాలి?
మీరు ఐఫోన్‌ని ఉపయోగిస్తుంటే వీటిని యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయలేరు. ఎందుకంటే యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడాన్ని అనుమతించదు. అటువంటి పరిస్థితిలో, ఐఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించే వారి స్నేహితులను అడగడం ద్వారా వాట్సాప్ స్టిక్కర్‌లను పొందవచ్చు. ఆపై వాటిని తమకు నచ్చినవారికి సంక్రాంతి శుభాకాంక్షల స్టిక్కర్లను ఫార్వర్డ్ చేయవచ్చు.


మరోవైపు పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఇటీవలే లాంచ్ అయ్యాయి. పోకో ఎక్స్6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌పై పోకో ఎక్స్6 ప్రో పని చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించడం విశేషం. ఈ డిస్‌ప్లేల రిజల్యూషన్ 1.5కే కాగా, వెనకవైపు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలు కూడా ఉన్నాయి. వీటిలో పోకో ఎక్స్6 బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, పోకో ఎక్స్6 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ రెండు ఫోన్ల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం 67Wగా ఉంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!