Protection From Hacking: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా హ్యాకింగ్ సర్వ సాధారణం అయిపోయింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు వినియోగదారులను దీని గురించి ఎంత హెచ్చరిస్తున్నా హ్యాకింగ్స్ మాత్రం ఆగడం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు.


బలమైన పాస్‌వర్డ్ పెట్టుకోండి
మీ సోషల్ మీడియా ఖాతాను హ్యాకింగ్ నుంచి రక్షించడానికి చేయాల్సిన ముఖ్యమైన పని బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం. సులభంగా ఊహించగలిగే లేదా సాధారణ పాస్‌వర్డ్‌లను వాడవద్దు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ అన్నీ ఉపయోగించి కనీసం 18 అక్షరాల పాస్‌వర్డ్‌ను సృష్టించండి.


టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్
టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) మీ ఖాతాకు అదనపు భద్రతను జోడిస్తుంది. 2FAని ఆన్ చేసిన తర్వాత, మీ ఖాతాను యాక్సెస్ చేయాలంటే హ్యాకర్‌లకు మీ ఫోన్ లేదా ఇమెయిల్‌కి వచ్చే కోడ్ కూడా అవసరం. ఇప్పుడు హ్యాకర్‌కు కోడ్ రాకపోతే అతను ఖచ్చితంగా మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు.


ఫిషింగ్ స్కామ్‌ల విషయంలో జాగ్రత్త వహించండి
ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్ సేఫ్టీ గురించి మాట్లాడాం. అయితే ఇది సెక్యూరిటీకి సంబంధించినది. ఈ విషయంలో మీరు మాత్రమే ఈ జాగ్రత్త తీసుకోవాలి. వాస్తవానికి ఫిషింగ్ స్కామ్‌లు లాగిన్ డిటైల్స్ దొంగిలించడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి. మీరు ఎల్లప్పుడూ తెలియని లింక్‌లు, ఈమెయిల్‌లు లేదా మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు.


సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి
ఏదైనా సోషల్ మీడియా కొత్త అప్‌డేట్‌ను కంపెనీ విడుదల చేసినట్లయితే, మీరు కచ్చితంగా దానికి సంబంధించిన లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగించాలి. అప్‌డేట్స్ ద్వారా కంపెనీ అనేక భద్రతా బగ్‌లను పరిష్కరిస్తుంది.


పబ్లిక్ వైఫై ఉపయోగించకండి
మీ డివైస్‌ను పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం ద్వారా, దానిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో పబ్లిక్ వై-ఫై ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. బదులుగా సురక్షితమైన, వ్యక్తిగత వైఫై నెట్‌వర్క్ లేదా మొబైల్ డేటా కనెక్షన్‌ని ఉపయోగించండి.


ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ, కంప్యూటర్ గేమ్స్, ఎడ్యుకేషన్ యాప్స్ పెరుగుదల కారణంగా పిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి గాడ్జెట్స్ స్క్రీన్‌  చూస్తూ సమయం గడుపుతున్నారు. ఇలా చేయడం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.


బ్రెజిలియన్ పరిశోధకుల అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. హెల్త్‌ కేర్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన కథనం ప్రకారం, వెన్నెముక ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రమాద కారకాలను గుర్తించింది. రోజుకు 3 గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం, స్క్రీన్‌కు దగ్గరగా ఉండటం, పొట్ట మీద పడుకోని చూడటం లాంటి వల్ల తీవ్ర ముప్పుతప్పదని తెలిపింది.  ఈ అధ్యయనం థొరాసిక్ వెన్నెముక నొప్పి (TSP) పై  కీలక దృష్టి పెట్టింది. థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో, ఎక్కువగా భుజం బ్లేడ్‌ల మధ్య ఉంటుంది. మెడ దిగువ నుండి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది.