గూగుల్ పే, పేటీయం, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు చేసేటప్పుడు ఇంటర్నెట్ మొరాయిస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఈ పరిస్థితిని చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఇంటర్నెట్ అవసరం లేకపోయినా యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరపవచ్చన్న సంగతి మీకు తెలుసా? మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్‌లోని USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) సర్వీసుల ద్వారా నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.


 ఇందులోని *99# సర్వీసు ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా 83 బ్యాంకులు, నాలుగు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఇది సపోర్ట్ చేయనుంది. హిందీ, ఇంగ్లిష్ సహా 13 భాషలను ఇది సపోర్ట్ చేయనుంది.


ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్‌ను సెటప్ చేయడం ఎలా?
1. మొదట మీ స్మార్ట్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్ ద్వారా *99#ను ఎంటర్ చేయండి. అయితే ఇదే ఫోన్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. లేకపోతే ఈ సర్వీసు పనిచేయదు.
2. ఆ తర్వాత మీకు కావాల్సిన భాషను, బ్యాంకు పేరును ఎంచుకోండి.
3. అక్కడ మీ ఖాతాకు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలు కనిపిస్తాయి.
4. వాటిలో మీరు దేని నుంచి లావాదేవీ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
5. ఇప్పుడు మీ డెబిట్ కార్డులోని ఆఖరి ఆరు అంకెలను ఎంటర్ చేయండి.
6. దీన్ని సక్సెస్‌ఫుల్‌గా సెట్ చేశాక మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.


ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా?
1. మొదట మీ ఫోన్‌లో *99#ను ఎంటర్ చేయండి. అనంతరం డబ్బులు పంపడానికి 1 నొక్కండి.
2. అక్కడ మీరు యూపీఐ ఐడీ లేదా ఫోన్ లేదా బ్యాంకు అకౌంట్ నంబర్ ద్వారా డబ్బులు పంపే ఆప్షన్ కనిపిస్తుంది. వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ కూడా నొక్కండి.


ఈ ప్రాసెస్ పూర్తయితే మీరు ఇంటర్నెట్ లేకుండా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసినట్లే. అయితే ఈ సేవలను ఉపయోగించుకున్నందుకు ఒక లావాదేవీకి రూ.0.5 చార్జ్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ ద్వారా ఒక లావాదేవీకి రూ.5,000 మాత్రమే పంపగలం.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!