ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దేని గురించైనా వెతకాలంటే చాలామంది గూగుల్ సెర్చ్‌ను ఉపయోగిస్తారు. అయితే ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ను డార్క్ మోడ్‌లోకి కూడా మార్చుకోవచ్చు. మీరు డెస్క్‌టాప్‌లో కూడా దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. డార్క్ అండ్ లైట్ మోడ్ సహా.. మొత్తంగా మూడు మోడ్లు ఇందులో ఉన్నాయి. కంప్యూటర్ డీఫాల్ట్ థీంను ఎంచుకుంటే.. మీరు సెలక్ట్ చేసుకున్న టైంలో డార్క్ మోడ్ ఆన్/ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇది కంటిపై శ్రమను తగ్గిస్తుంది.


గూగుల్ సెర్చ్ అప్పియరెన్స్ సెట్టింగ్స్‌ను ప్రత్యేక పోస్టు ద్వారా తెలిపారు. ఈ కొత్త సెట్టింగ్స్‌లో మూడు ఆప్షన్లు ఉన్నాయి. అవే డివైస్ డీఫాల్ట్, డార్క్, లైట్. త్వరలో ఇవి అందరు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.


గూగుల్ సెర్చ్‌లో డార్క్ మోడ్ యాక్టివేట్ చేయడం ఎలా?
గూగుల్ హోం పేజీ, సెర్చ్ రిజల్ట్స్ పేజీ, సెర్చ్ సెట్టింగులు, ఇతర లింక్డ్ వెబ్ పేజీలు అన్నిటికీ ఈ కొత్త అప్పియరెన్స్ అందుబాటులోకి రానుంది. డివైస్ డీఫాల్ట్ సెట్టింగ్‌ను ఎంచుకుంటే.. మీ డివైస్ కలర్ స్కీమ్‌తో గూగుల్ సెర్చ్ మ్యాచ్ అవుతుంది. డార్క్ సెట్టింగ్‌ను ఎంచుకుంటే డార్క్ బ్యాక్ గ్రౌండ్ మీద లైట్ టెక్స్ట్ కనిపిస్తుంది. లైట్ సెట్టింగును ఎంచుకుంటే లైట్ బ్యాక్‌గ్రౌండ్ మీద డార్క్ టెక్స్ట్ కనిపిస్తుంది.


1. ముందుగా మీ వెబ్ బ్రౌజర్‌లో google.com అని టైప్ చేసి ఎంటర్ చేయాలి.
2. గూగుల్ సెర్చ్ హోం పేజీ కుడివైపు కిందభాగంలో సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి.
3. అందులో అప్పియరెన్స్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ అవి సెట్టింగ్స్‌లో కనిపించకపోతే..సెర్చ్ సెట్టింగ్స్‌లో అప్పియరెన్స్‌ను ఎంచుకోవాలి.
4. డివైస్ డిఫాల్ట్, డార్క్, లైట్‌ల్లో మీకు నచ్చింది ఎంచుకోవాలి.
5. కిందవైపు ఉన్న సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి.


గూగుల్ ఈ డార్క్ మోడ్ ఫీచర్‌ను 2020 డిసెంబర్‌లోనే పరీక్షించింది.  గూగుల్ సెర్చ్ మొబైల్ యాప్‌కు 2020 మే నుంచే డార్క్ మోడ్ అందించారు.


Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి