పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది. తన సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యను పెంచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నందున సబ్‌స్క్రైబర్లకు ఈ విషయం తెలిపింది. ఇప్పుడు, కంపెనీ తన FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు) పేజీని మరిన్ని వివరాలతో అప్‌డేట్ చేసింది. ఇద్దరు వేర్వేరు వినియోగదారులు ఒకే ఖాతాను ఉపయోగించకుండా ఎలా ఆపివేస్తుంది? మీ ఇంట్లో నివసించని వ్యక్తులు సిరీస్‌లు, సినిమాలు చూడటానికి వారి సొంత ఖాతాలను ఉపయోగించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టంగా పేర్కొంది.


FAQ సెక్షన్‌లో మీ నెట్‌ఫ్లిక్స్ ఇంట్లో లేని డివైస్ నుంచి ఎవరైనా మీ ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా మీ బయట నుంచి మీ ఖాతాను నిరంతరం యాక్సెస్ చేసినట్లయితే, కంపెనీ ఆ డివైస్‌ను వెరిఫై చేయాలని కోరనుంది.


"మీ ఇంటి వెలుపల ఉన్న డివైస్‌ నుంచి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లో సైన్ ఇన్ చేసినప్పుడు లేదా నిరంతరం ఉపయోగించినప్పుడు, ఆ డివైస్‌ను వెరిఫై చేయాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్ కోరే అవకాశం ఉంది. డివైస్ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించడానికి మేం దీన్ని చేస్తాము. డిటైల్స్ కోసం దిగువన ఉన్న 'Verifying a device' చూడండి. మీరు మీతో నివసించని వారితో మీ ఖాతాను షేర్ చేస్తే Netflix ఖాతా రెన్యువల్ అవ్వదు."


డివైస్‌ను వెరిఫై చేయడగానికి Netflix OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) కోసం ప్రాథమిక ఖాతా యజమాని అందించిన ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌కు లింక్‌ను పంపుతుంది. వినియోగదారులు 15 నిమిషాల లోపు ఆ కోడ్‌ను నమోదు చేయాలి.


అంటే దీని అర్థం వినియోగదారులు ఇప్పటికీ ఖాతాలను షేర్ చేసుకోవచ్చు. వీరు పాస్‌వర్డ్‌లను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్‌కు ఏదైనా అనుమానం వస్తే సెకండరీ ఖాతాదారుని బ్లాక్ చేయవచ్చు లేదా ఫైన్ విధించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఖాతాను షేర్ చేసే వినియోగదారులను తనిఖీ చేయడానికి అదే పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించినప్పటికీ, ఇది సెక్యూరిటీ చెక్ అని అర్థం చేసుకోవచ్చు.


వినియోగదారులు షేరింగ్ చేయకుండా వారి స్వంత వ్యక్తిగత ప్లాన్‌లను పొందాలని కంపెనీ సిఫార్సు చేస్తుంది. వారు ఇప్పటికీ అదే ఖాతాను ఉపయోగించాలనుకుంటే, వినియోగదారులు మరిన్ని ప్రొఫైల్‌లను క్రియేట్ చేయవచ్చు. అయితే అది సొంత ప్లాన్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


భారతదేశంలో ప్రాథమిక నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌కు నెలకు రూ.149 ఖర్చవుతుంది. సాధారణ ప్రాథమిక ప్లాన్‌కు నెలకు రూ.199 ఖర్చవుతుంది. రెండు ప్లాన్‌లు ఒకేసారి ఒక డివైస్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. రూ.149 మొబైల్ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే పని చేస్తుంది. రూ.199 ప్లాన్ హెచ్‌డీ రిజల్యూషన్‌లో ఏ డివైస్‌లో అయినా సపోర్ట్ చేయవచ్చు.


దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ మరో రెండు ప్లాన్‌లు అందిస్తుంది. రూ.499 ప్లాన్ రెండు డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు పూర్తి-HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. అగ్రశ్రేణి ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ. 649 ఖర్చవుతుంది. వినియోగదారులు Ultra-HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ని స్ట్రీమ్ చేయవచ్చు.


నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్/ఖాతా షేరింగ్‌ను ఎందుకు ముగించింది?
2022 ప్రథమార్థంలో Netflix కొత్త సబ్‌స్క్రైబర్‌లను యాడ్ చేసుకోవడంలో విఫలమైంది. కంపెనీ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. అయితే డెవలప్‌మెంట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కేవలం 1.7 శాతం మాత్రమే పెరిగి 7.84 బిలియన్ డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది.