Apple Airtag Uses: మనందరం కొన్ని సార్లు వస్తువులు ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం. తర్వాత వాటిని వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ 2021లో ఎయిర్ ట్యాగ్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక చిన్న ట్రాకింగ్ గ్యాడ్జెట్. కానీ ఊహించనంతగా సక్సెస్ అయింది. 2023 సంవత్సరానికి గానూ అమెరికాలో ఎయిర్ ట్యాగ్ లాభాలు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఇవి విక్రయాలు కాదు లాభాలు మాత్రమే. విడుదల అయి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ యాపిల్ ఎయిర్ ట్యాగ్ డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. మనదేశంలో కూడా ఎయిర్ ట్యాగ్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ధరను మనదేశంలో రూ.3,499గా నిర్ణయించారు. 


తాళాలు, వాలెట్, ఫోన్ ఇటువంటి వస్తువు మర్చిపోయినప్పుడు ఎయిర్ ట్యాగ్ ద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు. దీనికి మీరు చేయల్సిందల్లా ఎయిర్ ట్యాగ్ కొనుగోలు చేసి వాటికి అటాచ్ చేయడమే. కేవలం ఇది మాత్రమే కాకుండా వీటికి ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఎక్కువమంది యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అయితే ఎయిర్‌ట్యాగ్‌ను ఎలా ఉపయోగించాలి? బ్యాటరీ ఎప్పుడు మార్చాలి? అనే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. వాటి బ్యాటరీ డెడ్ అయిపోతే ఎవరికీ ఉపయోగం ఉండదు.


యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఎలా పని చేస్తుంది?
యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ప్రిసిషన్ ఫైండింగ్ ద్వారా పని చేస్తాయి. అంటే మీరు మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లేదా మ్యాక్‌ల్లో ఫైండ్ మై యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు చుట్టుపక్కల 30 అడుగుల రేంజ్‌లో ఉన్న బ్లూటూత్ డివైస్‌ల సిగ్నల్‌ను పిక్ చేసుకుంటాయి. అయితే మధ్యలో గోడల వంటివి ఉంటే ఎయిర్ ట్యాగ్ రేంజ్ కూడా మారే అవకాశం ఉంది.


మీకు దగ్గరలో ఉన్న ఇతరుల డివైస్‌లు కూడా ఎయిర్‌ట్యాగ్‌ను డిటెక్ట్ చేస్తాయా అనే భయం మీకు ఉండవచ్చు. కానీ అలాంటి ప్రమాదం లేదు. ఫైండ్ మై నెట్‌వర్క్ పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్, గోప్యమైన నెట్‌వర్క్. మీరు దేని కోసం వెతుకుతున్నారో దాని చుట్టుపక్కల ఉన్న డివైస్‌ల లొకేషన్‌ను మీ ఐక్లౌడ్‌కు పంపిస్తాయి, మీ డివైస్‌కు మెసేజ్ కూడా వస్తుంది. ప్రిసిషన్ ఫైండింగ్ అనేది ఒక సెక్యూర్ ఫీచర్. ఐఫోన్ 11 ఆపైన మొబైల్స్‌కు ఇది పని చేస్తుంది.


2021లో యాపిల్ చేసిన టెస్టింగ్‌ల ప్రకారం ప్రతి రోజూ నాలుగు సార్లు సౌండ్ చేసి, ఒక్కసారి ప్రిసిషన్ ఫైండింగ్ ఉపయోగిస్తే ఎయిర్ ట్యాగ్ బ్యాటరీ సంవత్సరం పైనే వస్తుంది. అయితే ఇది పూర్తిగా మన వాడకం మీద ఆధారపడి ఉంటుందని అనుకోవాలి. మీరు దాన్ని ఉపయోగిస్తారు? అందులో ఏ బ్యాటరీ వేస్తారు? దాన్ని ఎక్కడ ఉంచుతారు? ఇలాంటి అంశాలు కూడా ఎయిర్ ట్యాగ్ బ్యాటరీ లైఫ్‌ను ప్రభావితం చేస్తాయి. అయితే బ్యాటరీ మార్చాల్సిన సమయం వచ్చినప్పుడు మీ ఐఫోన్‌కు అలెర్ట్ వస్తుంది. ఇందులో సీఆర్2032 లిథియం 3వీ కాయిన్ బ్యాటరీని అందించారు. కాబట్టి సులభంగా మార్చేయవచ్చు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!