Amardeep: ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమర్‌దీప్. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు అమర్ దీప్.


నేనేంటో అందరికీ తెలిసింది


"బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒకేసారి బ్లాంక్ అయిపోయాను. బిగ్ బాస్ కి విన్నర్ అవ్వలేకపోయినాసరే.. రవితేజ గారి సినిమాలో నాకు చాన్స్ వచ్చింది. అది నాకు విన్నర్ తోనే సమానం. నేను దానికోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను. ముందు కన్నా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్న స్టార్ డం నాకు దక్కింది. అందరి దగ్గర నాకు పేరు లభించింది. నేనంటే ఏంటో అందరికీ తెలిసింది. అంతకన్నా నాకేమీ అవసరం లేదు." అని అమర్ తెలిపాడు.


స్ట్రాంగ్ గా బయటికి వచ్చా


"బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కొంత మంది స్ట్రాంగ్ అవుతారు, మరికొందరు వీక్ అవుతారు. కానీ నేను మాత్రం చాలా మెచ్యూర్డ్ అయ్యాను. ముందు కన్నా చాలా స్ట్రాంగ్ గా అయ్యి మెచ్యూరిటీతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాను. ముందు కన్నా నాలో చాలా మార్పు వచ్చింది. చాలా మందికి బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందరితో కనెక్షన్స్ వల్ల చాలా వీక్ అయిపోతారు. నేను కూడా అలా అయ్యా కానీ.. చివరికి ఏదో ఒకటి నేర్చుకునే బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ గా బయటికి వచ్చా" అని పేర్కొన్నాడు.


పల్లవి ప్రశాంత్ అరెస్టు విషయంపై


"ఒక బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్ అవడం అనేది గతంలో ఎన్నడూ జరగనిది. నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ విషయం వెనుక ఏదో మిస్ అండర్స్టాండింగ్ ఉండే ఉంటుంది. అందుకే అలా జరిగింది తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. బిగ్ బాస్ లో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నా భార్య తేజస్విని నన్ను చాలా మిస్ అయింది’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు అమర్. ‘‘చాలా రోజులు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి అందుకే అలా ఎమోషనల్ అయింది. ఈ జర్నీ ఇద్దరికీ చాలా కష్టంగానే అనిపించింది కానీ కొన్ని తప్పవు కదా. తనతో పాటు నా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్ని రోజులు నేను దూరంగా ఉండడం వల్ల చాలా ఎమోషనల్ అయ్యారు" అని తెలిపాడు.


"బిగ్ బాస్ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. రవితేజ సినిమా చాలా త్వరలోనే రాబోతుంది. కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. అవేంటో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్" అని అమర్ దీప్ పేర్కొన్నాడు.


Read Also: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ