Honor X9B Launch Date: హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని భారతీయ వేరియంట్‌లో కూడా గ్లోబల్ మోడల్ ఫీచర్లే ఉండనున్నాయి. ఈ ఫోన్ ఇటీవలే ఒక ఈ-కామర్స్ వెబ్ సైట్లో కనిపించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. దీని లాంచ్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించింది.


హానర్‌టెక్ తన అధికారిక ఎక్స్/ట్విట్టర్ పేజీలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ రానుందని తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటి అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే ఇదే అని తెలిపింది. 360 డిగ్రీల హోల్ డివైస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండనుంది. స్క్రీన్, ఫ్రేమ్, అంతర్గత భాగాలకు ఈ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్‌ప్లేను హానర్ అందించింది.


హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం హానర్ ఎక్స్9బీ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో రానుంది. సన్‌రైజ్ ఆరెంజ్ రంగులో ఎంట్రీ ఇవ్వనుంది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్5ఈ, 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్, 24 నెలల బ్యాటరీ హెల్త్ వారంటీ కూడా ఉండనుంది.


హానర్ ఛాయిస్ ఎక్స్5 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో కొనుగోలు చేస్తే రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అదే మొబైల్ ఒక్కటే కావాలనుకుంటే రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండనుందని తెలుస్తోంది. అదే బ్యాంకు ఆఫర్లతో కొనుగోలు చేస్తే రూ.23,999కే రావచ్చు.


ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే... క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. గ్లోబల్ మార్కెట్లలో 6.78 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5800 ఎంఏహెచ్ కాగా, 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. మూడు స్టోరేజ్ ఆప్షన్లు, మూడు కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కూడా అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందించనున్నారు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!