HONOR MagicBook X16 (2024): హానర్ కంపెనీ తన లేటెస్ట్ ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ పేరు హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 (2024). ఇందులో కంపెనీ 16 అంగుళాల డిస్‌ప్లే, 42 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-12450హెచ్ ప్రాసెసర్‌లను అందించింది. ఈ ల్యాప్‌టాప్ అన్ని స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 (2024) ధర, లాంచ్ ఆఫర్లు
కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో రూ.44,990 ధరతో లాంచ్ చేసింది. వినియోగదారులు దీనిని అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో వినియోగదారులు ఈ ల్యాప్‌టాప్‌ను 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే గరిష్టంగా రూ. 3000 తగ్గింపు లభించనుందన్న మాట. అంటే దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు.
హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 (2024) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డిస్‌ప్లే: ఈ ల్యాప్‌టాప్ 16 అంగుళాల ఫుల్ హెచ్‌డీ హానర్ ఫుల్‌వ్యూ స్క్రీన్‌ని కలిగి ఉంది.
ప్రాసెసర్: హానర్ కంపెనీకి ఈ ల్యాప్‌టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ i5-12450H ప్రాసెసర్‌పై పని చేయనుంది.
ర్యామ్: 16 జీబీ ర్యామ్‌ను ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు.
స్టోరేజ్: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 (2024 )లో 512 జీబీ పీసీఐఈ ఎస్ఎస్‌డీ స్పేస్‌ను అందించారు. తద్వారా వినియోగదారులకు స్టోరేజ్ ప్రాబ్లం రాదన్న మాట.
కెమెరా: వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా వీడియో సమావేశాల కోసం కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లో హానర్ 720P హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ను అందించింది.
బ్యాటరీ: భారతదేశంలో ప్రారంభించిన ఈ ల్యాప్‌టాప్‌లో హానర్ 42 డబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించింది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
కనెక్టివిటీ: ఈ ల్యాప్‌టాప్‌లో హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ-సీ హెడ్‌ఫోన్ జాక్, మైక్, యూఎస్‌బీ-ఏ పోర్ట్ వంటి కనెక్టివిటీ కోసం అనేక లక్షణాలను కలిగి ఉంది.
బరువు: ఈ ల్యాప్‌టాప్ బరువు 1.68 కిలోలుగా ఉంది.
మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇంతకు ముందు లాంచ్ అయింది. ఇప్పుడు ఆ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.20 వేల ధరలోపే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు రూ.37,999 కాగా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సేల్‌లో రూ.19,699 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!